Bank : బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారానికి 5 రోజులే పని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank : భారతదేశంలోని బ్యాంక్ ఉద్యోగులు త్వరలో గొప్ప బహుమతిని పొందనున్నారు. బ్యాంకు ఉద్యోగుల పాత డిమాండ్‌ను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగుల వారానికి 5 పనిదినాల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోందని తెలుస్తోంది. బ్యాంకు ఉద్యోగుల పాత డిమాండ్‌కు ముహూర్తం ఖరారు చేసేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసి, మార్పును అమలులోకి తీసుకురావచ్చు.
ఇదే జరిగితే ఇప్పుడు బ్యాంకు ఉద్యోగులు ప్రతి వారం 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత విధానంలో బ్యాంకు ఉద్యోగులకు నెలలో ప్రతి ఆదివారం సెలవు ఉంటుంది, కానీ ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు లేదు. ప్రతి నెలా మొదటి, మూడవ, ఐదవ శనివారాలు బ్యాంకులు తెరిచి ఉంటాయి, అయితే నెలలో రెండవ, నాల్గవ శనివారాలు బ్యాంకు ఉద్యోగులకు సెలవులు.
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
Read Also:Hyderabad : డ్రైవర్ నిర్లక్ష్యానికి చిన్నారి మృతి..తల్లి పరిస్థితి విషమం..
వారానికి 5 పనిదినాల విధానాన్ని అమలు చేయాలని బ్యాంకుల ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా చేసింది. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా ముందుకు సాగుతుందని, వేజ్ బోర్డు సవరణతో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయవచ్చని పేర్కొంది. కరోనా మహమ్మారి తర్వాత మొదట ఐదు పనిదినాల డిమాండ్ వచ్చింది. అయితే, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఈ డిమాండ్‌ను తిరస్కరించింది. బదులుగా 19 శాతం వేతన పెంపును ఇచ్చింది. తర్వాత వారంలో ఐదు రోజుల పని డిమాండ్ ఊపందుకుంది. ఈ డిమాండ్ కోసం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ నేతృత్వంలో ఈ ఏడాది జనవరిలో బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మె కూడా చేశారు.
మీడియా కథనాల ప్రకారం.. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వారానికి 5 రోజుల తర్వాత పని గంటలు పెంచాలనే డిమాండ్‌కు అంగీకరించింది. వారానికి 5 రోజుల డిమాండ్‌ను పరిశీలిస్తామని ఫిబ్రవరి 2023లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించింది. దీంతో ప్రతిరోజు 40 నిమిషాల పనివేళలు పెంచాలనే షరతును జోడించారు. ఇదే జరిగితే బ్యాంకు ఉద్యోగులు ఉదయం 09:45 నుంచి సాయంత్రం 05:30 వరకు పని చేయాల్సి ఉంటుంది.
Read Also:Assam : అస్సాంలో ఆయుధాలతో లొంగిపోయిన 39 మంది తీవ్రవాదులు
తాజావార్తలు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!