Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Good News For Alluarjun Fans Pushpa 2 Is Going To Release In Japan

Pushpa 2 : అల్లుఅర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. జపాన్ లో రిలీజ్ కాబోతున్న ‘పుష్ప 2’..

Published Date :March 4, 2024 , 11:54 am
By Murali Krishna
Pushpa 2 : అల్లుఅర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. జపాన్ లో రిలీజ్ కాబోతున్న ‘పుష్ప 2’..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

తెలుగు సినిమా ప్రపంచస్థాయికి ఎదిగింది. తెలుగు హీరోలకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా అనేది కేవలం రీజియనల్ అన్నట్టుగా మాత్రమే ఉండేది.కానీ ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా తెలుగు సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అదే తరహాలో ప్రస్తుతం చాలామంది ఆడియన్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘పుష్ప 2’ కూడా ఒకటి. ఇప్పటికే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అందుకే పుష్ప సీక్వెల్ ను ఇతర దేశాల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.‘పుష్ప’మూవీకి ఇండియాలో మాత్రమే కాదు.. చైనా మరియు జపాన్ వంటి దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్లో ఇప్పుడు చాలామంది మూవీ లవర్స్ ‘పుష్ప’ మూవీతో అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ అయ్యారు. దీనితో సీక్వెల్ ని జపాన్ లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ‘పుష్ప 2’కు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నా కూడా దీనిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వడానికి మూవీ టీమ్ సిద్ధంగా లేదు.

ఇప్పటివరకు ఈ సీక్వెల్ నుండి ఒక పోస్టర్ మరియు గ్లింప్స్ మాత్రమే విడుదల అయ్యింది. అంతే కాకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకోవాలి అనుకుంటున్నా కూడా ఎన్నోసార్లు ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. కానీ ఇంతలోనే అల్లు అర్జున్ జపాన్ ఫ్యాన్స్ కి మాత్రం ఒక గుడ్ న్యూస్ వినిపించింది రష్మిక.‘పుష్ప’లో టైటిల్ పాత్రతో అల్లు అర్జున్ కి ఎంత క్రేజ్ లభించిందో.. అందులో శ్రీవల్లిగా నటించిన రష్మికకు కూడా అంతే పాపులారిటీ లభించింది. అందుకే ‘పుష్ప 2’లో అసలు తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తున్న రష్మిక.. తాజాగా టోక్యోలో జరిగిన క్రంచీరోల్ యానిమీ అవార్డ్స్ ఈవెంట్ కి హాజరయ్యింది. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘పుష్ప 2’పై కీలక అప్డేట్ ని అందించింది.”జపాన్ లోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పుష్ప 2 ఒరిజినల్ వర్షన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో.. అదే రోజు జపాన్ లో కూడా సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇది చాలా భారీగా ఉండబోతుంది’’ అని రష్మిక మందనా చెప్పుకొచ్చింది. దీంతో జపాన్ ఫ్యాన్స్ లో ఉత్సాహం మరింత పెరిగిపోయింది. 2024 ఆగస్ట్ 15న ఎలాగైనా ‘పుష్ప 2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు

Also Read

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • alluarjun
  • pushpa 2
  • Rashmika
  • sukumar

తాజావార్తలు

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions