Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Food Gongura Mutton Curry Recipe Amma Chethi Vanta Style

Gongura Mutton: గోంగూర మటన్ ఈసారి ఇలా చేయండి.. ఒక్క ముక్క మిగిలితే ఒట్టు

Published Date :March 11, 2026 , 9:53 pm
By Shiva Ganesh
Gongura Mutton: గోంగూర మటన్ ఈసారి ఇలా చేయండి.. ఒక్క ముక్క మిగిలితే ఒట్టు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gongura Mutton: మటన్ ప్రియులకు గోంగూర కాంబినేషన్ అంటేనే ఒక ఎమోషన్. పుల్లపుల్లగా, ఘాటుగా ఉండే ఈ కర్రీని అన్నంలో కలుపుకుని తింటుంటే వచ్చే తృప్తే వేరు. మటన్ స్మెల్ అనేది అస్సలు లేకుండా, ముక్క మెత్తగా దూదిలా ఉడికేలా చేసే ఈ స్పెషల్ ‘గోంగూర మటన్’ను ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Umbilical Cord: బొడ్డు తాడు పారేస్తున్నారా? ప్రాణాంతక వ్యాధులను నయం చేసే ‘మెడికల్ మిరాకిల్’ ఇదే!

కావలసిన పదార్థాలు:
మటన్: అర కేజీ (చిన్న ముక్కలు)

గోంగూర: 4 చిన్న కట్టలు (సుమారు 150 గ్రాములు)

మారినేషన్ కోసం: పసుపు (1/2 స్పూన్), ఉప్పు (1 స్పూన్), నిమ్మరసం (1 స్పూన్), నూనె (1 స్పూన్).

మసాలా పొడి కోసం: ధనియాలు (1 టేబుల్ స్పూన్), జీలకర్ర (1 స్పూన్), మిరియాలు (1 స్పూన్), గసగసాలు (1 స్పూన్), ఎండు కొబ్బరి ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాపత్రి, అనాస పువ్వు.

ఇతరాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, నూనె, కరివేపాకు, కొత్తిమీర.

తయారీ విధానం:
ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి ఒక బౌల్‌లోకి తీసుకోండి. అందులో పసుపు, ఉప్పు, నిమ్మరసం, కొద్దిగా నూనె వేసి బాగా కలిపి అరగంట నుంచి గంట సేపు పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల మటన్ స్మెల్ రాకుండా, ముక్క మెత్తగా ఉడుకుతుంది. తర్వాత మిక్సీ జార్‌లో పైన చెప్పిన మసాలా దినుసులన్నీ (ధనియాలు, జీలకర్ర, గసగసాలు, గరం మసాలా దినుసులు, ఎండు కొబ్బరి) వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ తాజా మసాలానే కూరకు అసలైన రుచిని ఇస్తుంది. దీనిని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి శుభ్రం చేసిన గోంగూర ఆకులు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొంచెం ఉప్పు, పసుపు వేసి మెత్తగా మగ్గనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి.

కుక్కర్‌లో నూనె వేసి హోల్ స్పైసెస్ (చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు) వేసి వేయించండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఎర్రగా వేయించి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు మారినేట్ చేసిన మటన్‌ను వేసి 10-15 నిమిషాలు మగ్గనివ్వండి. తర్వాత కారం, తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. మటన్ మెత్తగా ఉడికిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పొడిని వేసి కలపండి. రెండు నిమిషాల తర్వాత గోంగూర పేస్ట్‌ను కూడా వేసి బాగా కలిపి, నూనె పైకి తేలే వరకు (సుమారు 5 నిమిషాలు) ఉడికించండి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి గోంగూర మటన్ సిద్ధం.

ముఖ్యమైన చిట్కాలు:
* మటన్‌ను నిమ్మరసం, ఉప్పుతో మారినేట్ చేయడం వల్ల ముక్క సాఫ్ట్‌గా మారుతుంది.

* గోంగూరను మరీ మెత్తగా పేస్ట్‌లా చేయకుండా కొంచెం బరకగా ఉంచితే తినేటప్పుడు రుచి బాగుంటుంది.

* ఈ కర్రీ అన్నం, బిర్యానీ, బగారా రైస్ లేదా చపాతీల్లోకి అద్భుతమైన కాంబినేషన్.

ఈసారి మీరు కూడా ఇంట్లో ఈ పద్ధతిలో ట్రై చేయండి, అందరూ ఫిదా అవ్వాల్సిందే.

READ ALSO: Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amma Chethi Vanta Mutton Curry
  • Andhra Style Gongura Mutton
  • Gongura Mutton Curry Recipe in Telugu
  • How to make Gongura Mutton in Pressure Cooker
  • Mutton recipes for beginners

తాజావార్తలు

  • PM Ujjwala Yojana: ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు వస్తాయా?.. సబ్సిడీ లభిస్తుందా? పూర్తి వివరాలు

  • Gongura Mutton: గోంగూర మటన్ ఈసారి ఇలా చేయండి.. ఒక్క ముక్క మిగిలితే ఒట్టు

  • Umbilical Cord: బొడ్డు తాడు పారేస్తున్నారా? ప్రాణాంతక వ్యాధులను నయం చేసే ‘మెడికల్ మిరాకిల్’ ఇదే!

  • Arshdeep Singh and Daryl Mitchell Controversy: అర్ష్‌దీప్ సింగ్‌ను వెనకేసుకొచ్చిన గంభీర్.. మిచెల్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు..!

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

ట్రెండింగ్‌

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions