అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం కలుగుతుందని.. సంపద పెరుగుతుందని భావిస్తుంటారు. అక్షయ తృతీయ నాడు గోల్డ్ షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడుతుంటాయి. బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటాయి. అయితే గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం పసిడి ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. తులం బంగారం ధర ఏకంగా లక్షను తాకింది. దీంతో బంగారం కొనేందుకు గోల్డ్ లవర్స్ ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ, అక్షయ తృతీయ సందర్భంగా నేడు దేశీయ ఆభరణాల విపణిలో దాదాపు రూ. 16 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేస్తోంది.
Also Read:Nagachithanya : నాగచైతన్య-శోభితపై ఆ రూమర్లు.. అంతా ఫేకేనా..?
ఓ వైపు పుత్తడి ధరలు పెరుగుతున్నప్పటికీ ఈ రోజు తక్కువ పరిమాణంలోనైనా బంగారం కొనేందుకు ప్రజలు ముందుకు వస్తారని తెలిపింది. గతేడాది అక్షయ తృతీయ రోజున 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 73,500గా ఉంది. ప్రస్తుతం రూ. లక్షకు చేరింది. ధరలు ఆకాశాన్నంటుతుండడంతో ఈ ఏడాది కొనుగోళ్లపై ప్రభావం పడొచ్చని ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్ ఫెడరేషన్ అధ్యక్షుడు పంకజ్ అరోరా తెలిపారు. అక్షయ తృతీయ రోజున దాదాపు 12 వేల కోట్ల విలువైన 12 టన్నుల పసిడి, రూ. 4 వేల కోట్ల విలువైన 40 టన్నుల వెండి అమ్మకాలు నమోదు కావొచ్చని ఆయన అంచాన వేశారు. మొత్తంగా రూ. 16 వేల కోట్ల మేర వ్యాపారం జరగొచ్చని అంచనా వేశారు.
