గత కొన్ని నెలలుగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ.. అందనంత దూరంలో నిలిచిన విషయం తెలిసిందే. ఓ సమయంలో తులం బంగారం ధర లక్షా 30లకు పైగా దూసుకెళ్లింది. అయితే గత వారం రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. శనివారం పెరిగిన గోల్డ్ రేట్స్.. ఈరోజు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో ఈరోజు 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.114 తగ్గగా.. 1 గ్రాము 22 క్యారెట్లపై రూ.105 తగ్గింది. ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,24,480.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,14,100గా ట్రేడ్ అవుతోంది.
బంగారం ధరలు హైదరాబాద్లో చూసుకంటే.. 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,24,480గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.1,140 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,14,100 ఉండగా.. నిన్నటితో పోల్చుకుంటే రూ.1,050 తగ్గింది. విశాఖ, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. తమిళనాడులో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,910గా ఉండగా.. బెంగళూరులో రూ.1,24,480గా ఉంది. శనివారం పెరిగిన బంగారం ధరలు.. దాదాపు అంతే రీతిలో ఈరోజు తగ్గడం ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు. మొత్తంగా వారం రోజులుగా పసిడి ధరలు తగ్గాయనే చెప్పాలి.
Also Read: Cyclone Montha: ‘మొంథా’ తుపాను ఎఫెక్ట్.. విద్యాసంస్థలు, పర్యాటక కేంద్రాలు క్లోజ్!
ఇక వెండి ధరలు కూడా ఊరటనిస్తున్నాయి. గత 10 పది రోజులుగా వెండి ధరలు పెరగలేదు. గత మూడు రోజులుగా సిల్వర్ రేట్స్ స్థిరంగా ఉన్నాయి. అంతకుముందు వరుసగా నాలుగు రోజులు భారీ స్థాయిలో తగ్గాయి. బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,55,000గా నమోదైంది. హైదరాబాద్లో తులం వెండి రూ.1,70,000గా ఉంది. విజయవాడ, విశాఖలో 10 గ్రాముల వెండి రూ.1,700గా ఉంది. వరుసగా గోల్డ్, సిల్వర్ రేట్స్ తగ్గుతున్న నేపథ్యంలో షాప్స్ కాస్త కిటకిటలాడుతున్నాయి.