Site icon NTV Telugu

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. అయినా మగువలకు నిరాశే!

Gold Price

Gold Price

బంగారం ధరలు కొత్త రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్.. ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. కొన్నాళ్లుగా పెరిగినప్పుడు వేళల్లో పెరిగి.. తగ్గినపుడు మాత్రం వందల్లో మాత్రమే తగ్గుతోంది. దాంతో బంగారం ధరలు తగ్గినా పెద్దగా సంతోషపడాల్సిన పరిస్థితి లేదు. పసిడి ధరలు వరుసగా రెండు రోజలు తగ్గినా.. తులం రేటు లక్షా 11 వేల పైనే ఉంది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500, 24 క్యారెట్లపై రూ.540 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (సెప్టెంబర్ 18) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,01,900 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.1,11,170గా నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,900గా.. 24 క్యారెట్ల ధర రూ.11,11,170గా కొనసాగుతోంది. దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.1,02,050గా.. 22 క్యారెట్ల ధర రూ.1,11,320గా ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు రోజురోజుకు పరుగులు పెడుతున్న నేపథ్యంలో సామాన్య జనాలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవలి రోజుల్లో బంగారం షాపులు వద్ద జనాల సందడి తగ్గిందని నిపుణులు అంటున్నారు.

Also Read: Pakistan Cricket: అక్కడ 16 మిలియన్ డాలర్లు.. పాకిస్థాన్‌కు అంత సీన్ లేదు!

మరోవైపు వెండి పరిస్థితి కూడా అలానే ఉంది. వరుసగా రెండు రోజులుగా వెండి ధర తగ్గినా.. లక్ష 41 వేలుగా ఉంది. కిలో వెండిపై నిన్న 2 వేలు, ఈరోజు వెయ్యి తగ్గి.. బులియన్ మార్కెట్‌లో రూ.1,31,000గా ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 41 వేలుగా నమోదైంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో లక్ష 31 వేలుగా ఉంది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవి.

Exit mobile version