Gold Rate Today on December 18th 2023 in Hyderabad: ఇటీవలి కాలంలో వరుసగా పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడినట్లే ఉంది. మొన్నటి వరకు భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆదివారం తులం బంగారంపై రూ. 400 తగ్గగా.. సోమవారం స్థిరంగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (డిసెంబర్ 18) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,300 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,510గా ఉంది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,450లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,660గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,900లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,160గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 57,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,510గా కొనసాగుతోంది.
Also Read: KL Rahul: కేఎల్ రాహుల్ అరుదైన ఘనత.. ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాలేదు!
మరోవైపు వెండి ధర కూడా నేడు స్థిరంగానే ఉంది. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర సోమవారం రూ. 77,700లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 77,700లు ఉండగా.. చెన్నైలో రూ. 79,700గా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,500గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 79,700లుగా ఉంది. వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 79,700 వద్ద కొనసాగుతోంది.