పసిడి ప్రేమికులకు అదిరే శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇటీవల వరుసగా పెరిగిన గోల్డ్ రేట్లు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోతున్నాయి. గత పది రోజుల్లో 7 వేలకు పైగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు కూడా భారీగా పడిపోయింది. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.82 తగ్గి.. రూ.12,246గా ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 1 గ్రాము పసిడి రేటు రూ.75 తగ్గి.. రూ.11,225గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఈరోజు ధర రూ.1,22,460గా.. 22 క్యారెట్ల ధర రూ.1,12,250గా నమోదైంది.
అక్టోబర్ 28న హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460గా నమోదవగా.. 22 క్యారెట్ల ధర రూ.1,12,250గా కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 24 క్యారెట్లపై రూ.820.. 22 క్యారెట్లపై రూ.750 తగ్గింది. విశాఖ, విజయవాడలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,23,280గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,13,000గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,610గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,12,350గా ట్రేడ్ అవుతోంది.
Also Read: IND Playing XI: కుల్దీప్, నితీష్ రెడ్డి ఔట్.. మొదటి టీ20లో భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పతనమవుతున్నాయి. గత 10 పది రోజులుగా వెండి ధరలు తగ్గడం లేదా స్థిరంగా ఉండడమే తప్ప.. పెరగలేదు. గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ఈరోజు భారీగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై 4 వేలు తగ్గింది. ఈరోజు కిలో వెండి ధర రూ.1,51,000గా ట్రేడ్ అయింది. హైదరాబాద్‌లో తులం వెండి రూ.1,65,000గా నమోదైంది. పైన ఇచ్చిన బంగారం, వెండి ధరలకు జీఎస్‌టీ అదనంగా పడుతుంది. జీఎస్‌టీ కలుపుకుంటే బంగారం, వెండి ధరలు ఇంకా ఎక్కువ ఉంటుందని గుర్తించుకోవాలి.
