Site icon NTV Telugu

Gold Rate Today: శుభవార్త.. భారీగా దిగొస్తున్న బంగారం ధరలు! నేటి గోల్డ్ రేట్స్ ఇవే

Gold Price

Gold Price

Gold Prices Drop on 19 August 2025: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా వరుసగా పరుగులు పెట్టిన పసిడి ధరలు.. భారీగా దిగొస్తున్నాయి. గత 10 రోజులుగా గోల్డ్ రేట్లు పతనం అవుతూనే ఉన్నాయి. దాంతో ఆల్‌టైమ్‌ రికార్డ్ స్థాయి నుంచి బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.400.. 24 క్యారెట్లపై రూ.430 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (ఆగష్టు 19) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,350గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,00,750గా ట్రేడ్ అవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విశాఖ, విజయవాడల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.92,350గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,00,750గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.92,500గా.. 24 క్యారెట్ల ధర రూ.1,00,900గా ట్రేడ్ అవుతోంది. రేట్లు తగ్గుముఖం పడుతుండడంతో పసిడి ప్రియులకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. పెళ్లిళ్ల సీజన్లో గోల్డ్ రేట్స్ తగ్గడంతో వధువు పేరెంట్స్ సంతోషపడుతున్నారు.

Also Read: Farmer Unique Idea: కోతుల బెడదకు వినూత్న ఆలోచన చేసిన రైతు.. వావ్ అనాల్సిందే!

మరోవైపు వరుసగా పెరిగిన వెండి ధరలు నేడు తగ్గాయి. ఈరోజు కిలో వెండిపై రూ.1000 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,16,000గా ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 26 వేలుగా నమోదైంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ఒక లక్ష 17 వేలుగా ఉంది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లో నమోదైన బంగారం, వెండి ధరలు. ప్రాంతాల వారీగా ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే.

Exit mobile version