NTV Telugu Site icon

Gold Prices : షాకిచ్చిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే ?

Gold Rates Today

Gold Rates Today

Gold Prices : మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత ఉన్న ఇంకెంతైనా కొనేందుకు వెనుకాడదు. అలా కొనాలనుకున్న వాళ్లకు గత కొన్ని నెలలుగా నిరాశే ఎదురవుతుంది. బంగారం ధరలు వరుసగా బ్రేకులు లేకుండా పెరుగుతూ వస్తున్నాయి. తగ్గుతాయని ఎంత ఆశతో ఎదురు చూస్తున్నప్పటికీ తగ్గడమే లేదు. గత వారం వ్యవధిలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1300 కు పైగా పెరగ్గా.. 14వ తారీఖు స్వల్పంగా రూ. 100తగ్గింది. ఇక వరుసగా పడిపోతుందేమో అనుకున్న వాళ్లుకు మళ్లీ నిరాశే మిగిలింది. నిన్న ఇవాళ్ల వరుసగా గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఇదే సమయంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా బంగారం ధరలు కిందటి రోజుతో పోలిస్తే పెరిగాయి. దేశీయంగా బంగారం ధరలతో పాటుగా వెండి రేట్లు కూడా కిందటి రోజుతో పోలిస్తే పెరిగాయని చెప్పొచ్చు.

Read Also:Manchu Family : మంచు కుటుంబంలో చల్లారని మంటలు

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 500 పెరగడంతో తులం ఇప్పుడు రూ. 73,900కు చేరింది. దీనికి ముందు రోజు రూ. 100 తగ్గింది. మరోవైపు 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన పసిడి ధర రూ. 110 పెరగడంతో 10 గ్రాములకు రూ. 80,620వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. 22 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 500 పెరిగి ఇప్పుడు రూ. 74,050 వద్ద ఉండగా.. 24 క్యారెట్స్ పుత్తడి ధర రూ.550పెరిగి తులం రూ. 80,770 వద్ద ట్రేడవుతోంది. వెండి ధరల విషయానికి వస్తే కిందటి రోజు రూ. 2000 పెరిగి కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ. 1.03 లక్షలకు చేరుకుంది.

Read Also:Nalgonda Collector: ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు.. నల్గొండ కలెక్టర్ సంచలన నిర్ణయం!

Show comments