Manchu Family : మంచు కుటుంబంలో చల్లారని మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచు కుటుంబంలోని తండ్రి కొడుకుల మధ్య మంటలు చల్లారలేదు. నిన్న శ్రీవిద్యానికేతన్ యూనివర్సిటీ క్యాంపస్ లోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక యత్నించగా పోలీసులు, సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక చేసేదేమి లేక యూనివర్సీటి పక్కన ఫామ్ హౌస్ లోని తన నానమ్మ, తాత సమాధులకు మొక్కుకుని మనోజ్ దంపతులు వెనుదిరిగారు.
Also Read : Manchu Family : మోహన్ బాబు వర్సిటీ వద్ద ఉద్రిక్తత.. మంచు మనోజ్ కారుపై దాడి
Also Read
నిన్న జరిగిన ఘటనపై ఇరు వర్గాలలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎంబియు దగ్గర అడ్డుకున్న ఘటనపై ఇవాళ చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాడు మంచు మనోజ్. కోర్టు తీర్పు ఉల్లంఘన కింద కేసు నమోదు చేయాలని మనోజ్ పై నిన్న ఫిర్యాదు చేసిన మంచు మోహన్ బాబు. సంక్రాంతి సంధర్బంగా తాత, నానమ్మ సమాధులకు నివాళులు అర్పించేందుకు ఎంబియు’కు వచ్చిన మనోజ్ ఫ్యామిలీ అడ్డుకున్న ఎంబియు సిబ్బంది, బౌన్సర్లు, ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ‘ఎంతమంది బౌన్సర్లను పంపుతారో పంపండి నేను ఒక్క డిని చాలు వారికి సమాధానం చెప్పడానికి’ అంటూ మనోజ్ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో విష్ణు అనుచ రులుగా భావిస్తున్న యువకుల బృందంలో ఒకరు కర్రతో మనోజ్ వాహనంపై దాడి చేసారు. కాగా, కోర్టు ధిక్కరణకు పాల్పడిన మనోజ్ పై పోలీసులకు మోహాన్ బాబు ఫిర్యాదు చేయడంతో నేడు మోహన్ బాబు పై చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదుచేయబోతున్నాడు మనోజ్. మరి ఈ మంచు వారి మంటలు ఎప్పుడు చల్లారతాయో చూడాలి.
తాజావార్తలు
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్‌లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!