Site icon NTV Telugu

Gold Rate Today: భయపెడుతున్న బంగారం ధరలు.. నేడు రూ. 1250 పెరిగిన పసిడి ధర..

Gold Price

Gold Price

గోల్డ్ ధరలు గజగజ వణికిస్తున్నాయి. వేలకు వేలు పెరుగుతూ షాకిస్తున్నాయి. నేడు గోల్డ్ ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. తులం గోల్డ్ ధర రూ. లక్షా 22 వేలు దాటి పరుగులు తీస్తోంది. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 1250 పెరిగింది. కిలో వెండి ధర రూ.100 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.12,202, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,185 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1150 పెరిగింది. దీంతో రూ.1,11,850 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1250 పెరిగింది.

Also Read:India: సొంత ప్రజలను బాంబులతో చంపుకుంటుంది.. యూఎన్‌లో పాక్‌ ఉపాన్యాసంపై భారత్ ధ్వజం

దీంతో రూ. 1,22,020 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,000 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,070 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,67,100 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,57,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

Exit mobile version