NTV Telugu Site icon

Gold Price Today: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today

Gold Price Today

Gold and Silver Prices in Hyderabad on 2024 March 18: గత కొన్ని నెలలుగా బంగారం ధరలు పరుగులు పెడుతూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో అయితే గోల్డ్ రేట్లు బాగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 66 వేలకు చేరుకుంది. అయితే వరుసగా పెరుగుతున్న పసిడి ధరలకు కాస్త బ్రేక్ పడినట్లు కనబడుతోంది. గత 4-5 రోజులుగా స్వల్పంగా తగ్గడం లేదా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (మార్చి 18) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,580గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.66,090గా ఉంది. నిన్నటితో పోలిచ్చుకుంటే 22 క్యారెట్ల బంగారంపై రూ.10.. 24 క్యారెట్ల బంగారంపై రూ.10 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఢిల్లీ:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,730
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,240

ముంబై:
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,580
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,090

చెన్నై:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,140
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700

బెంగళూరు, కోల్‌కతా, కేరళ:
22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,580
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,090

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం:
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,580
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,090

Also Read: Singer Mangli: సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం.. స్వల్ప గాయాలు!

మరోవైపు నేడు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై రూ.100 తగ్గి.. రూ.77,200లుగా ఉంది. నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,200గా ఉంది. ముంబైలో రూ.77,200 ఉండగా.. చెన్నైలో రూ.80,200గా కొనసాగుతోంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.80,200లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,000గా ఉంది.

 

 

Show comments