Gold and Silver Price in Hyderabad on 2024 January 31st: గత 2-3 రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు మళ్లీ షాక్ ఇస్తున్నాయి. వరుసగా రెండోరోజు పసిడి ధరలు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (జనవరి 31) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,270 గా ఉంది. నిన్నటితో పోలిచ్చుకుంటే.. 22 క్యారెట్ల బంగారంపై రూ.200, 24 క్యారెట్ల బంగారంపై రూ.220 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.63,420గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,000గా.. 24 క్యారెట్ల ధర రూ.63,270గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.58,600, 24 క్యారెట్ల ధర రూ.63,930గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,000 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.63,270గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.63,270 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,800, 24 క్యారెట్ల ధర రూ.63,050 ఉంది.
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (జనవరి 31) కిలో వెండిపై రూ. 300 పెరిగి.. రూ.76,500 లుగా కొనసాగుతోంది. ఈరోజు ఢిల్లీలో వెండి కిలో ధర రూ.76,500గా ఉంది. ముంబైలో రూ.76,500 ఉండగా.. చెన్నైలో రూ.78,000గా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,000 ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.78,000లుగా కొనసాగుతోంది.