Gold Price Today : బంగారం ధరలు ఏ రోజుకారోజు మారుతూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న మార్పులు, బంగారానికి ఉన్న డిమాండ్ వంటి అనేక అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. 2025 ప్రారంభంలో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. బంగారం ఎప్పటికప్పుడు విశ్వసనీయమైన పెట్టుబడిగా ఉండడంతో బంగారం కొనుగోలుదారులు ఈ పెరుగుదలతో ఏ విధంగా ఎదుర్కోవాలో ఆలోచనలో పడిపోతున్నారు. ఈ నెల ఆరంభం నుంచి బంగారం ధరలు కెరటాల్లాగ ఎగురుకుంటూ వచ్చాయి. కానీ నిన్న కొంచెం తగ్గిన అది పెద్ద ప్రభావం చూపించలేదు. వేలకు వేలు పెరిగి వందలు తగ్గితే అది గణనీయమైన తగ్గింపు కాదు.
Read Also:Bengaluru: చదువుకోమని తల్లి మందలింపు.. 20వ అంతస్తు నుంచి దూకి టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
ఫిబ్రవరి 12వ తేదీన బంగారం ధర ఎలా ఉందో మనందరికీ తెలుసు.. 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.79400 గా ఉంది. అదే 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ, 86670 గా ఉన్నట్టు. ఈరోజు అంటే ఫిబ్రవరి 13వ తేదీన బంగారం ధరలు 22 క్యారట్ల బంగారం పది గ్రాములకు 400పెరిగి రూ. 79,800 గా ఉంది. అదే 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు 380 పెరిగి రూ.87050 గా ఉంది. నిన్నటి పోలిస్తే ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. కానీ ఫిబ్రవరి 11 వ తేదీతో పోలిస్తే తక్కువే అని చెప్పాలి. వెండి మాత్రం స్థిరంగా లక్షా ఏడు వేల వద్దే కొనసాగుతుంది.
Read Also:KTR: పేద రైతుకు ఒక న్యాయం.. పదవిలో ఉన్న వారికి మరో న్యాయమా?