2024 చివరి రోజున బంగారం రేట్లు తగ్గి.. గోల్డ్ లవర్స్‌కి గుడ్ న్యూస్ అందించాయి. అయితే న్యూఇయర్ వేళ పసిడి రేట్లు భారీగా పెరిగి షాక్ ఇచ్చాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.440 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (జనవరి 1) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,500గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ.78,000గా నమోదైంది.
మరోవైపు గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి రేట్స్.. నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.90,500గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 98 వేలుగా ఉంది. అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే నగరాల్లో రూ.90,500గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,500
విజయవాడ – రూ.71,500
ఢిల్లీ – రూ.71,650
చెన్నై – రూ.71,500
బెంగళూరు – రూ.71,500
ముంబై – రూ.71,500
కోల్‌కతా – రూ.71,500
కేరళ – రూ.71,500
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.78,000
విజయవాడ – రూ.78,000
ఢిల్లీ – రూ.78,150
చెన్నై – రూ.78,000
బెంగళూరు – రూ.78,000
ముంబై – రూ.78,000
కోల్‌కతా – రూ.78,000
కేరళ – రూ.78,000
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.98,000
విజయవాడ – రూ.98,000
ఢిల్లీ – రూ.90,500
ముంబై – రూ.90,500
చెన్నై – రూ.98,000
కోల్‌కతా – రూ.90,500
బెంగళూరు – రూ.90,500
కేరళ – రూ.98,000