Site icon NTV Telugu

Gold Price Today: ఇది కదా కావాల్సింది.. నేడు కూడా భారీ తగ్గింపు!

Gold Price Today

Gold Price Today

Big Drop in Gold and Silver Rates in Hyderabad: కొన్ని రోజులుగా వరుసగా పరుగులు పెట్టిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. గత 10-12 రోజుల నుంచి గోల్డ్ రేట్స్ క్రమంగా దిగొస్తున్నాయి. శ్రావణ మాసం ప్రారంభంలో ఆల్‌టైమ్‌ హైకి చేరుకున్న బంగారం.. ఇప్పుడు దిగిరావడం పసిడి ప్రేమికులకు ఊరటనిస్తోంది. ఈ రోజు (ఆగష్టు 20) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 600 రూపాయలు తగ్గి.. రూ.1,00,750 నుంచి రూ.1,00,150గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ బంగారం 550 రూపాయలు తగ్గి.. రూ.92,350 నుంచి రూ.91,800గా ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌, విశాఖ, విజయవాడల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఈరోజు బంగారం ధరలే కాదు.. వెండి ధర కూడా భారీగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 తగ్గి.. రూ.1,16,000 నుంచి రూ.1,15,000కి చేరింది. హైదరాబాద్ మార్కెట్‌లో నేడు కిలో వెండి లక్ష 25 వేలుగా నమోదైంది. తులం వెండి రూ.1,250కి లభిస్తోంది. మంగళవారం ఉదయం 10 గంటల వరకు పలు వెబ్‌సైట్లో నమోదైన గోల్డ్, సిల్వర్ ధరలు ఇవి. ప్రాంతాల వారీగా ధరల్లో మార్పులు ఉంటాయన్న సంగతి తెలిసిందే.

Also Read: Asia Cup 2025: బెంచ్‌లో ‘ఆ నలుగురు’.. భారత తుది జట్టు ఇదేనా?

12 రోజుల క్రితంతో పోల్చితే.. ఇప్పుడు తులం బంగారంపై రూ.3000కు పైగా తగ్గింది. ఇది బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి అవకాశం అనే చెప్పాలి. భారత్‌లో గోల్డ్ రేట్స్ తగ్గడానికి లేదా పెరగడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, దిగుమతి సుంకాలు, టాక్స్, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాలు.. లాంటివి బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందుకే దేశవ్యాప్తంగా రోజువారీ బంగారం ధరలలో మార్పు ఉంటుంది.

Exit mobile version