NTV Telugu Site icon

Gold Rate: మహిళలు గుడ్ న్యూస్.. బంగారం ధర ఢమాల్.. వారం రోజుల్లో ఏకంగా..

Gold

Gold

ఆకాశమే హద్దుగా వెళ్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడినట్లయింది. ఇకపోతే గడిచిన వారం రోజుల నుంచి గోల్డ్ ధరలు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. ఇదివరకు గడిచిన 6 రోజుల్లో 10 గ్రా. ల 24 క్యారెట్ల బంగారంపై సుమారు 3వేల రూపాయల వరకు తగ్గింది. ఇదే కొనసాగితే ఈ నెల చివరికి గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారంతోపాటుగా వెండి ధర కూడా తగ్గుతూ వస్తోంది. గత వారంలో లక్షదాటిన కిలో వెండి ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది.

Prabhas: అభిమాని మరణిస్తే ప్రభాస్ చేసిన పనికి శబాష్ అనాల్సిందే..

ఇక తెలుగు రాష్ట్రాల్లో ధరలను చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం నాడు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మార్కెట్ నివేదికల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ట్ట‌ణంలో 22క్యారట్ల 10 గ్రా. ల బంగారం ధర రూ.66,400 ఉండగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.72,440 గా కొనసాగుతుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వీటి ధరలు చూస్తే.. ముంబయి, కోల్కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారట్ల 10గ్రా. ల గోల్డ్ ధర రూ.66,400 ఉండగా, 24 క్యారట్ల 10 గ్రా. ల బంగారం ధర రూ. 72,440 గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రా. ల బంగారం ధర రూ. 66,550 కాగా, 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 72,590 గా ఉంది.

Smuggling Gang: స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు.. రూ. 7.75 కోట్ల విలువైన బంగారం స్వాధీనం..

ఇక మరోవైపు వెండి ధరలను చూస్తే ఇలా ఉన్నాయి. నేడు దేశ వ్యాప్తంగా వెండి ధరలో ఎలాంటి మార్పులు లేవు. ఇక నేడు ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ. 96,000 ఉండగా.. చెన్నైలో కూడా వెండి రూ.96,000.., కోల్కతా, ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ. 91,500 గా కొనసాగుంది. బెంగళూరులో రూ. 92,500 గా కొనసాగుతుంది.