Site icon NTV Telugu

Today Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మరోసారి భారీగా పెరిగిన ధరలు..!

Gold Rate Today

Gold Rate Today

Today Gold Rate: బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి ప్రజలకు షాక్ ఇచ్చాయి. ఇటీవల స్వల్పంగా తగ్గుతూ వచ్చిన ధరలు మళ్లీ తిరోగమనం పట్టాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్‌లో ఉండటంతో ప్రజలు బంగారం కొనుగోలుపై ఆలోచనలో పడిపోతున్నారు. బంగారం ధరల పెరుగుదలకు గ్లోబల్ రాజకీయ పరిస్థితులు, అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు, రూపాయి మారకం విలువ తగ్గడం, రష్యా-యుక్రెయిన్ యుద్ధం, మూడీస్ అమెరికా రేటింగ్ తగ్గింపు వంటి అంశాలు కారణంగా నిలిచాయి. దీంతో స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడటమే కాకుండా రిటైల్ మార్కెట్లోనూ బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఈ ధరల పెరుగుదలతో బంగారు ఆభరణాల రేట్లు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: Amrit Railway Stations: ప్రధానమంత్రి చేతుల మీదుగా దేశవ్యాప్తంగా 103 ‘అమృత్’ రైల్వే స్టేషన్ల ప్రారంభం..!

ఇక నేడు 24 క్యారెట్ల ధర 10 గ్రాములు రూ.490 ఎగిసి రూ.97,910 వద్ద ట్రేడ్ అవుతుంది. అదే 18 క్యారెట్ల ధర రూ.370 పెంపుతో రూ.73,070 వద్ద ట్రేడ్ జరుగుతుంది. ఇక 10 గ్రాములు 22 క్యారెట్ల ధర చూస్తే.. నిన్నటి ధర కంటే 10 గ్రాములకు రూ.450 పెరిగి, రూ.89,300 వడ ట్రేడ్ అవుతుంది. ఇక వెండి ధరలను పరిసలించినట్లైతే.. కేజీపై ఏకంగా రూ. 1000 పెరిగింది. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలలో కేజీ వెండి రూ. 1,12,000గా అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, పూణేలో కేజీ వెండి కేవలం రూ. 1,01,000 లేక్ ట్రేడ్ అవుతుంది.

Read Also: Hamas-Israel: ఐడీఎఫ్ దాడిలో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ హతం! నెతన్యాహు ప్రకటన

Exit mobile version