Site icon NTV Telugu

Gold Rate Today: రూ. లక్షా 15 వేల వైపు పసిడి పరుగులు.. ఒక్కరోజే రూ. 1260 పెరిగింది.. రూ. లక్షా 49 వేలకు చేరిన సిల్వర్

Goldrates

Goldrates

బంగారం ధరలు దడపుట్టిస్తున్నాయి. వేలకు వేలు పెరుగుతూ వణికిస్తున్నాయి. గోల్డ్ ధరలు రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. తులం గోల్డ్ ధర రూ. లక్షా 15 వేల వైపు పరుగులు తీస్తోంది. పుత్తడి బాటలోనే సిల్వర్ పయనిస్తోంది. కిలో వెండి ధర రూ. లక్షా 49 వేలకు చేరింది. ఇవాళ గోల్డ్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఒక్కరేజే రూ. 1260 పెరిగింది. కిలో సిల్వర్ ధర రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.11,433, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,480 వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read:They Call Him OG: ఓజీ డిస్ట్రిబ్యూషన్ ఒక టార్చర్.. యూరప్ డిస్ట్రిబ్యూటర్ సంచలన ప్రకటన

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1150 పెరిగింది. దీంతో రూ.1,04,800 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1260 పెరిగింది. దీంతో రూ. 1,14,330 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,950 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,480 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,49,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,39,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

Exit mobile version