Gold and Silver Price: బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో 61 వేల మార్క్‌లో గోల్డ్ రేట్ కొనసాగుతోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 10 రూపాయలు తగ్గి.. 61 వేల 30 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 10 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం 55 వేల 940 రూపాయలుగా ఉంది గోల్డ్ రేట్. ఇక కిలో వెండి ధర 78వేల 5 వందలుగా ఉంది. ఈ రోజు దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,090గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,180గా ఉండగా.. కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,940గా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 61,030గా ఉంది. ఇక, చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,500గా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,640గా కొనసాగుతోంది.. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 55,990గాను.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,080 దగ్గర ట్రేడ్ అవుతోంది.
మరోవైపు వెండి ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,850గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 78,500 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 81,500 పలుకుతోంది. కోల్‌కతాలో రూ. 78,500.. బెంగళూరులో రూ. 81,500గా ఉంది. కాగా, బంగారం ధర మరింత పుంజుకుంటున్న విషయం విదితమే.. బంగారం ధర గత ఇరవై ఏళ్లుగా మరింతగా జోరందుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2000వ సంవత్సరంలో రూ.4,400 ఉండగా.. 2005 నాటికి రూ.7 వేలకు పెరిగింది. 2010లో తులం బంగారం ధర రూ.18,500గా ఉండగా.. 2015 నాటికి రూ.26,300కి చేరుకుంది. 2020లో 10 గ్రాముల బంగారం ధర రూ.48,600గా ఉంది. ఇప్పుడు ఏకంగా రూ.62 వేలకు చేరుకున్న విషయం విదితమే..
బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు మార్కెట్ నిపుణులు… భారత్ లాంటి దేశాల్లో ఆర్నమెంట్ గోల్డ్ క గిరాకీ పెరగడం ప్రధాన కారణం. ఇటీవలి కాలంలో బంగారాన్ని పెట్టుబడి ఆప్షన్ గా చూస్తుండటం కూడా మరో కారణం. ఆర్థిక మాంద్యం భయంతో ప్రభుత్వాలు, దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకోవడం కూడా పసిడి పరుగుకు కారణంగా ఉంది. ఒకప్పుడు మన దేశంలో బంగారాన్ని కేవలం నగల కోసమే కొనేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్టాక్ మార్కెట్లలో అస్థిరత, రియల్ ఎస్టేట్ స్లో డౌన్ తో బంగారాన్ని ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా చూసే ధోరణి పెరిగింది. చరిత్ర చూసుకుంటే ఏటా గ్యారెంటీగా 15 శాతం రాబడి ఇస్తున్న పుత్తడికి మించిన పెట్టుబడి ఏముందనే ఆలోచనలు వస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో హెచ్చుతగ్గులుంటాయి. భూముల విలువలు కూడా స్థిరంగా ఉండవు. బంగారం ధరల్లోనూ తేడాలున్నా.. ఓవరాల్ పెరగడమే కానీ.. తగ్గడం అరుదనే వాదన ఉంది. ఈ పాయింటే బంగారంపై పెట్టబడుల్ని బాగా ఆకర్షిస్తోంది.