NTV Telugu Site icon

Giriraj Singh: నాథూరామ్ గాడ్సే భారతదేశపు సుపుత్రుడు..

Giriraj Singh

Giriraj Singh

మహాత్మా గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సే భారతదేశ సుపుత్రుడు (సపుత్‌) అని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అన్నారు. గాడ్సే భారతదేశంలోనే జన్మించాడు.. అతను బాబర్‌, ఔరంగజేబుల మాదిరిగా విదేశీ దురాక్రమణదారుడు కాదని అన్నారు. ఛత్తీ్‌సగఢ్‌లోని దంతెవాడలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని కొన్ని పట్టణాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటలపై మాట్లాడుతున్న ఈ వ్యాఖ్యలు చేశారు. గాడ్సే..గాంధీని చంపినప్పటికీ ఈ దేశంలోనే జన్మించాడని, భారత మాత ముద్దుబిడ్డా అని ఆయన చెప్పారు.

Read Also : Top Headlines@9AM: టాప్ న్యూస్

ఇటీవల మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఇటీవల జరిగిన హింసాకాండ తర్వాత ఔరంగజేబ్-టిప్పు సుల్తాన్‌లను కీర్తిస్తూ కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఈ పోస్ట్‌లకు వ్యతిరేకంగా హిందూత్వ సంస్థలు నిరసన వ్యక్తం చేశాయి. మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శాంతిని కాపాడాలని విజ్ఞప్తి చేయగా..ఔరంగజేబును కీర్తిస్తే ప్రతిస్పందించవలసి ఉంటుంది అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.

Read Also : Chennai: సినిమా సీన్ కాదు అంతకుమింది.. రన్నింగ్ బస్సు ఎక్కి దొంగతనం

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. గాడ్సే భారతదేశం యొక్క సుపుత్రుడు( సాపుత్ ) అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ను స్పందించారు. గాడ్సే, గాంధీని హత్య చేసిన కూడా అతను భారత జాతి ముద్దుబిడ్డా ( సుపుత్రుడు)గా అభివర్ణించాడు. ప్రస్తుతం బాబర్-ఔరంగజేబ్ లను కీర్తిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లపై బీజేపీ-ఎంఐఎం మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.