తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా.. వరద నీరు భారీగా గోదావరిలో చేరుతుంది. దీంతో పైనుండి వచ్చే వరదలతో గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. గత మూడు రోజుల నుంచి గోదావరి హెచ్చుతగ్గులు అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా భద్రాచలం వద్ద మొదటి ప్రమాద స్థాయి దిగువకి ప్రవహిస్తుంది. మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షపాతం తగ్గిపోవడంతో.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుతుంది. శుక్రవారం గోదావరి 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం దాని పర్యవసానం పై నిరంతరం జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలోనే రెండు రోజులు ఉండి వరద ఉధృతిపై ఎప్పటికప్పుడు పరిశీలించారు. నిన్న ఉదయం నుంచి గోదావరి తగ్గు ముఖం పట్టినప్పటికీ మళ్లీ రాత్రి ఒక అడుగు మేరకు పెరిగింది. మళ్లీ మొదటి ప్రమాద స్థాయికి గోదావరి పెరిగింది.
Gujarat: గుజరాత్ హైకోర్టు సీజేగా జస్టిస్ సునీతా అగర్వాల్ ప్రమాణ స్వీకారం
ఆదివారం తెల్లవారు జాము నుంచి మళ్ళీ గోదావరి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 42 అడుగులతో గోదావరి నీటిమట్టం ఉంది. అంటే మొదటి ప్రమాదవ స్థాయి దిగువలో గోదావరి వరద భద్రాచలం వద్ద ఉన్నది. దిగువన ఉన్న పోలవరం వద్ద గోదావరి నీరు వేగంగా వెళ్తుండటంతో గోదావరి భద్రాచలం వద్ద తగ్గు ముఖం పట్టింది. అయితే శబరి నది కూడా పోటు ఉండటంతో గోదావరి చాలా స్వల్పంగా తగ్గుతూ ఉన్నది. మరోవైపు వరద నీటి వల్ల ముంపునకు గురయ్యే పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్ తెలిపారు. వరద ఉధృతి దృష్ట్యా ప్రజలు జిల్లా యంత్రాంగం తెలిపిన సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రియాంక అల సూచించారు. అత్యవసర సేవలకు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని, ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు.