NTV Telugu Site icon

God : ఓటీటీ లోకి రాబోతున్న సైకో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Whatsapp Image 2023 10 24 At 11.36.53 Am

Whatsapp Image 2023 10 24 At 11.36.53 Am

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇరైవన్‌. తెలుగులో ఈ సినిమా గాడ్‌ గా రిలీజైంది. ఈ సినిమాలో జయం రవి సరసన సౌత్ లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార హీరోయిన్ గా నటించింది.ఐ.అహ్మద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ సెప్టెంబర్‌ 28 తమిళంలో విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ను తెచ్చుకుంది.దీంతో రెండు వారాల తర్వాత తెలుగులో కూడా గాడ్ పేరుతో థియేటర్లలో విడుదల చేశారు. అక్టోబర్‌ 13న విడుదలైన ఈ మూవీ  తెలుగులో కూడా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే అప్పుడే ఈ సైకో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ గాడ్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌ 26 నుంచి ఈ సినిమా ఓటీటీ లో అందుబాటులోకి తీసుకురానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా గాడ్‌ స్ట్రీమింగ్ కానుంది.గాడ్‌ సినిమాలో వినోద్ కిషన్‌, రాహుల్ బోస్‌, విజయలక్ష్మి, నరైన్‌, ఆశిష్ విద్యార్థి,చార్లీ, అశ్విన్‌ కుమార్‌ మరియు భగవత్ పెరుమాల్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.. ప్యాషన్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై సుధన్ సుందరం, జి.జయరాం మరియు సి.హెచ్.సతీష్ కుమార్ ఈ ను సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ యువన్‌ శంకర్‌ రాజా మ్యూజిక్ అందించారు.. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సిటీలో సైకో కిల్లర్ (రాహుల్ బోస్) అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఎంతో కిరాతకంగా చంపేస్తుంటాడు. అతనిని ఐపీఎస్‌ ఆఫీసర్‌ అర్జున్‌ పట్టుకుంటారు. అయితే ఆ కిల్లర్‌ను పట్టుకున్న తర్వాత కూడా అమ్మాయిల హత్యలు జరుగుతూనే ఉంటాయి.. మరి అసలు వాళ్లని ఎవరు చంపుతారు..ఎందుకు చంపుతారో తెలుసుకోవాలంటే గాడ్‌ సినిమా చూడాల్సిందే.