NTV Telugu Site icon

Goa: గోవాలో గోబీ మంచురియాపై నిషేదం.. ఎందుకో తెలుసా..?

Manchuriya

Manchuriya

గోబీ మంచురియా డిష్ పై గోవాలో భారీ గొడవలు జరుగుతున్నాయి. గోబీని అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేయడం వల్ల ఈ డిష్‌లో ప్రమాదకర కలర్స్ వాడటంతో పాటు దుస్తులు ఉతకడానికి ఉపయోగించే పౌడర్‌‌ను సాస్‌ తయారీలో ఉపయోగించడంపై అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో అక్కడి స్థానిక సంస్థలు ఒక దాని తర్వాత మరొకటి ఈ డిష్ పై నిషేదం విధిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రసిద్ధ బోడ్గేశ్వర ఆలయ జాతర దగ్గర గోబీ మంచురియాను నిషేధించాలని మపుసా మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిలర్ తారక్ ఆరోల్కర్ వెల్లడించారు.

Read Also: CM Revanth Reddy: నేడు రాంచీకి రేవంత్.. న్యాయ్‌ యాత్రలో పాల్గొననున్న సీఎం..

అయితే, గత నెలలో ఓ తీర్మానాన్ని ప్రవేశ పెట్టాగా, సభ్యులందరూ ఈ తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేశారు. దీంతో వెంటనే గోబీ నిషేధం అమల్లోకి వచ్చింది. గోవాలో గోబీపై గతంలోనూ కొన్ని కౌన్సిల్స్ నిషేధం విధించాయి. శ్రీ దామోదర దేవాలయ వాస్కో సప్త జాతరలో గోబీ మంచురియాను విక్రయించే స్టాళ్లను నియంత్రించాలని 2022లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మోర్ముగావ్ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పోండాలోని కపిలేశ్వరి, సాతేరి దేవి జాతర సమయంలోనూ గోబీ తయారు చేసే షాప్స్ పై ఎఫ్​డీఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం గోవాలో గోబీ మంచురియాపై నిషేదం విధించారు.

Show comments