NTV Telugu Site icon

35 Chinna Katha Kaadu: 384 ఎంట్రీలలో ఒకటి.. ’35 చిన్న కథ కాదు’ చిత్రంకు అరుదైన ఘనత!

35 Chinna Katha Kaadu

35 Chinna Katha Kaadu

చిన్న సినిమాగా విడుదలైన ’35 చిన్న కథ కాదు’ మంచి సక్సెస్ అందుకుంది. మొదటి రోజు నుంచే పాజిటవ్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఓటీటీ వేదిక ‘ఆహా’లో కూడా రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోయింది. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రం తాజాగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. గోవాలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)లో ఈ చిత్రంను ప్రదర్శించనున్నారు.

గోవాలోని పనాజీలో నవంబర్‌ 20 నుంచి 28 వరకు ఐఎఫ్ఎఫ్ఐ 55వ ఈవెంట్‌ జరగనుంది. ఇందులో మొత్తం 25 సినిమాలను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం 384 చిత్రాలు ఎంట్రీ చేయగా.. తెలుగు నుంచి 35 చిన్న కథ కాదు ఎంపికైంది. ఈ విషయాన్ని పోస్ట్ ద్వారా చిత్ర యూనిట్ తెలిపింది. ఇది తెలుగు సినిమాకు ఎంతో గర్వకారణమని పేర్కొంది. ఇండియన్‌ పనోరమ అధికారికంగా ఎంపిక చేసినట్లు ప్రకటించింది.

Also Read: IND vs NZ 2nd Test: పీకల్లోతు కష్టాల్లో భారత్.. ఇక ఆశలు ఆ ఇద్దరిపైనే! లంచ్‌ బ్రేక్‌కు స్కోర్ ఎంతంటే?

నివేదా థామస్‌, విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘35 చిన్న కథ కాదు. ఈ సినిమాకు నంద కిశోర్‌ ఇమాని దర్శకత్వం వహించగా.. రానా నిర్మాత. తెలుగు, తమిళ, మలయాళంలలో సెప్టెంబర్‌ 6న ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో నివేదా తల్లి పాత్ర పోషించారు. కొడుకు చదువు కోసం ఆరాటపడే తల్లిగా నివేదా నటనకు ప్రశంసలు దక్కాయి.