NTV Telugu Site icon

Titanic Ship: టైటానిక్‌ షిప్‌ శిథిలాలు.. చూపించేందుకు తీసుకెళ్లే పర్యాటక జలాంతర్గామి మిస్సింగ్..!

Submarine

Submarine

టైటానిక్‌ షిప్‌ శిథిలాలను చూపించేందుకు తీసుకెళ్లే పర్యాటక జలాంతర్గామి మిస్సైంది. అయితే, ప్రమాద సమయంలో ఆ జలాంతర్గమిలో ఐదుగురు టూరిస్టులు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా అంట్లాంటిక్‌ మహాసముద్రంలోని ఏ ప్రాంతంలో ఈ జలాంతర్గామి మిస్సింగ్ అయింది అనేది మాత్రం తెలియలేదు. మరోవైపు, దీన్ని గుర్తించేందుకు బోస్టన్‌ కోస్ట్‌ గార్డు అధికారులు స్పెషల్ టీమ్స్ ను సముద్రంలోకి పంపించాయి.

Read Also: Vizag Affair Crime: త్రిల్లర్‌ సినిమాని తలపించే మిస్టరీ కేసు.. ఆ నాలుగు నంబర్లే హంతకుడ్ని పట్టించాయి

ఈ జలాంతర్గమి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. విలాసవంతమైన టైటానిక్‌ షిప్‌ 1912 ఏప్రిల్‌ 14న అట్లాంటిక్‌ మహా సముద్రంలో ఓ మంచుకొండను ఢీ కొట్టి మునిపోయింది. ఈ ఘటనలో 15వందల మంది జలసమాధి అయ్యారు. ఈ భారీ ఓడ శిథిలాలను సముద్ర గర్భంలో 1985లో గుర్తించారు. ఆ తర్వాత నుంచి కొంతమంది ఔత్సాహికులు, పరిశోధకులు ఈ జలాంతర్గాములతో అక్కడికి వెళ్లి శిథిలాలను చూసొస్తున్నారు. అయితే, తాజాగా అలా చూసేందుకు వెళ్తున్నప్పడే ఈ జలాంతర్గామి అదృశ్యమైనట్లు సమాచారం.

Read Also: Fatigue: నిద్ర లేమితో .. రోజంతా అలసటగా కనిపిస్తారు

ఈక్రమంలోనే ఆదివారం ఉదయం ఉపరితల నౌక MV పోలార్ ప్రిన్స్ తో దాని సంబంధాలు తెగిపోయాయి. గల్లంతైన ఆ సబ్మెర్సిబుల్ వెసెల్ లో ఐదుగురు ఉన్నారని అమెరికా, కెనడా దేశాల కోస్ట్‌గార్డ్‌ విభాగాలు తెలిపాయి. వెంటనే ఉత్తర అట్లాంటిక్‌ సముద్రంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని వారు తెలిపారు. టైటానిక్ శిథిలాలు ఉన్న ప్రదేశానికి డైవ్ చేస్తున్న సమయంలో.. సబ్‌మెర్సిబుల్ అదృశ్యమైందని వెల్లడించారు. సముద్రంలోని సుమారు 13,000 అడుగుల లోతులో సబ్మెర్సిబుల్ అదృశ్యమైందని చెప్పుకొచ్చారు. 70 నుంచి 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ సబ్మెర్సిబుల్ లో ఉందని.. అది సోమవారం మధ్యాహ్నమే పూర్తయిపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.