Site icon NTV Telugu

Andhra Pradesh: వారికి ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. కారుణ్య నియామకాలకు అనుమతిస్తూ జీవో

Ap Govt

Ap Govt

Andhra Pradesh: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఎవ్వరినీ విడిచిపెట్టలేదు.. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు ఎలా ఎంతో మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. అయితే, కోవిడ్ కారణంగా మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. కోవిడ్ కారణంగా మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి నియమించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేసింది.

Read Also: DGP Anjani Kumar: రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు.. పోలీసులకు అలర్ట్

కాగా, కోవిడ్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 2,917 మంది ఉద్యోగులు మృతిచెందారు.. వారిలో ఇప్పటి వరకూ 2,744 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది.. ప్రత్యేక డ్రైవ్ కింద అర్హులైన వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.. 2023 ఆగస్టు 24 తేదీకల్లా అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. సెప్టెంబర్‌ 30 తేదీనాటికి ఈ నియామకాలకు సంబంధించి రిపోర్టు ఇవ్వాలని సూచించింది. అయితే, ఖాళీలు, పాయింట్లు, రోస్టర్లతో ఎటుంవంటి సంబంధం లేకుండా ఈ నియామకాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

Exit mobile version