NTV Telugu Site icon

Go First Flight: 50 మందిని వదిలేసి విమానం టేకాఫ్.. ప్రయాణికులు తీవ్ర అసహనం

Go First

Go First

Go First Flight: 50మందికి పైగా ప్రయాణికులను వదిలేసి ‘గో ఫస్ట్‌’ విమానం సరిగ్గా చెక్ చేసుకోకుండానే గాల్లోకి ఎరిగిపోయింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు. దీంతో సందరు సంస్థ ‘గో ఫస్ట్’.. అంతరాయానికి చింతిస్తున్నాం అంటూ సమాధానం చెప్పింది. బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన గో ఫస్ట్‌ ఎయిర్‌వేస్‌ విమానం ప్రయాణీకులు లిస్టు ప్రకారం అంతా వచ్చారా? విమానం ఎక్కారా లేదా? అనేది చూసుకోకుండానే గాల్లోకి ఎగిరిపోయింది. సదరు ప్రయాణీకులు లేట్ వల్ల విమానం ఎక్కలేకపోవటం కాదు. సదరు సంస్థ నిర్లక్ష్యం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఒక్కరు ఇద్దరు కాదు ఏకంగా..50 మందికి పైగా ప్రయాణికులను వదిలేసి టేకాఫ్‌ తీసుకుంది.

దీంతో విమానాశ్రయంలోనే మిగిలిపోయిన మిగతా ప్రయాణికులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. విమానయాన సంస్థ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఈ క్రమంలోనే కొంత మంది ట్వీట్‌లకు స్పందించిన గో ఫస్ట్‌ సంస్థ.. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు సమాధానం ఇచ్చింది. సంబంధిత ప్రయాణికులను తమ వివరాలు పంచుకోవాల్సిందిగా కోరింది. గో ఫస్ట్‌ చేసిన ఘనకార్యంపై శ్రేయా సిన్హా అనే ప్రయాణికురాలు ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ..‘ఉదయం 6.20కు విమానం ఉండగా.. 54 మందికిపైగా ప్రయాణికులు ఉదయం 5.35 గంటలకే బస్సు ఎక్కారు. కానీ గంటకుపైనే బస్సులోనే ఉంచేశారు. ఇది సంస్థ నిర్లక్ష్యమేనంటూ మండిపడ్డారు.

Tamilnadu: గవర్నర్‌ ప్రసంగంపై సీఎం అభ్యంతరం.. అసెంబ్లీ నుంచి వాకౌట్

అలాగే సతీశ్‌ కుమార్ అనే వ్యక్తి టికెట్ ఫొటోలు షేర్‌ చేస్తూ.. ఒక బస్సులోని ప్రయాణికులు మాత్రమే విమానంలో ఎక్కారని, మరో బస్సులోని వారంతా బస్సులోని ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారని వెల్లడించారు. ఇదే విషయాన్ని ప్రశ్నించగా ఫ్లైట్ తిరిగి వస్తుందని చెప్పారని కానీ ఎంతకు రాలేదని వాపోయారు. విమానయాన సంస్థతోపాటు జ్యోతిరాదిత్య సింధియా, ప్రధాని కార్యాలయానికి ట్యాగ్ చేస్తూ.. ఫిర్యాదులు చేశారు. అయితే, ఉదయం 10 గంటలకు మరో విమానంలో వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

Show comments