NTV Telugu Site icon

Global Rice Summit: హైదరాబాద్‌లో ప్రపంచ వరి సదస్సు.. సన్నాహాలు ముమ్మరం

Global Rice Summit

Global Rice Summit

Global Rice Summit: దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ కేంద్రంగా ప్రపంచ వరి సదస్సును జూన్‌ 7, 8వ తేదీల్లో తాజ్‌ కృష్ణా హోటల్‌లో నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఫిలిఫైన్స్‌) సహకారంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో 28 దేశాల నుంచి దాదాపు 500 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యాపారులు, అనుబంధ రంగాల ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. వివిధ దేశాల నుంచి వరి శాస్త్రవేత్తలు ఈ వరి సదస్సులో పాల్గొనే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రపంచ వరి సదస్సుకు సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ సదస్సులో వరి రకాల ప్రదర్శనతో పాటు రాష్ట్రానికి సంబంధించి వివిధ ఉత్పత్తుల లభ్యతపై వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు.

Read Also: MLC Jeevan Reddy: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్‌ను కాపాడడం ఎవరి తరం కాదు..

భారతదేశంలోనే తొలిసారిగా ప్రపంచ వరి సదస్సు-2024కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సు బియ్యం ఎగుమతులను ప్రోత్సహించడం, భారతదేశం, తెలంగాణ నుంచి బియ్యం రకాలను ప్రదర్శించడం, విజ్ఞాన వేదికను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇంటర్నేషనల్ కమోడిటీ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో జరుగుతుంది.

Show comments