Site icon NTV Telugu

Hanging From Building: గాలిలో చిక్కుకున్న కార్మికులు.. వీడియో వైరల్..

China

China

చైనాలో గ్లాస్ మెయింటెనెన్స్ వర్కర్లు గాలిలో వేలాడుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ వైరల్ వీడియో చక్కర్లు కొడుతుంది. ఈ క్లిప్‌లో చైనా రాజధాని నగరం బీజింగ్ లో బలమైన గాలుల కారణంగా అనేక మంది గ్లాస్ మెయింటెనెన్స్ వర్కర్లు బిల్డింగ్‌కు వేలాడుతున్నట్లు చూపిస్తుంది. భయానక క్లిప్‌లో అధిక ఎత్తులో కార్యకలాపాలు చేస్తున్నప్పుడు కార్మికులు గాలిలో చిక్కుకున్నట్లు, బలమైన గాలులకు ఊగుతున్నట్లు కనపడుతుంది. నివేదికల ప్రకారం., “స్పైడర్‌మెన్” బృందం ఒక వారం పాటు భవనం వద్ద కిటికీలను శుభ్రపరుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

LPG Cylinder Explodes: సమోసా దుకాణంలో పేలిన ఎల్‌పీజీ సిలిండర్.. వీడియో వైరల్..

ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం బీజింగ్‌లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం, ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. ఆకస్మిక బలమైన గాలితో నగరం అంతటా గందరగోళం ఏర్పడింది. ఫెంగ్‌ టై జిల్లాలోని కియాన్‌లింగ్‌ షాన్ పర్వతం వద్ద గాలి వేగం సెకనుకు 37.2 మీటర్లకు చేరుకుంది. ఇది టైఫూన్ బలానికి సమానమని వాతావరణ అధికారులు తెలిపారు. గాలి తుఫాను తర్వాత, కొమ్మలు, అక్కడక్క వాహనాలు పడిపోయినట్లు సమాచారం. సాయంత్రం రద్దీ సమయంలో రహదారి రద్దీని మరింత తీవ్రతరం చేసింది. ప్రభావిత ప్రాంతాల్లో శిథిలాలను తొలగించడానికి, విద్యుత్ మౌలిక సదుపాయాలను పునరుద్ధరణ చేయడానికి అధికారులు వారి టీంతో కష్టపడ్డారు.

Exit mobile version