తన ప్రేమకు అభ్యంతరం చెబుతున్నాడని ప్రియురాలి తండ్రిని ప్రియుడు హత్య చేసిన ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. ప్రేమకు అంగీకరించడం లేదని ప్రాణాలు తీసేంత బరి తెగిస్తున్నారు కేటుగాళ్లు.. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడొద్దని ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఈ దారుణాలు ఆగడం లేదు. తమకు కావాల్సిందల్లా ఒకటే అమ్మాయి.. అమ్మాయి కోసం పేరెంట్స్‌ను హత మారుస్తున్నారు.. వివరాల్లోకి వెళ్తే………
నెల్లూరులోని శ్రీనివాస్ నగర్‌లో మహబూబ్ బాషా అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మహబూబ్ బాషా కుమార్తెను సాదిక్ అనే వ్యక్తి గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వీరి ప్రేమను మహబూబ్ బాషా అంగీకరించకపోవడంతో సాదిక్ ఆగ్రహానికి గురయ్యాడు. బేకరీలో ఉద్యోగిగా పని చేసే మహబూబ్ బాషా కోసం కాపు కాచి కత్తితో దాడి చేశాడు. దీంతోజజ తీవ్రంగా గాయాలపాలైన మహబూబ్ బాషా అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరోవైపు నిందితుడు సాదిక్.. నవాబ్ పేట పోలీస్ స్టేషన్‌లో లొంగి పోయాడు.
Read Also: Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్‌కు రానున్న 73 దేశాల దౌత్య వేత్తలు