NTV Telugu Site icon

Crime News: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు.. పెట్రోల్‌ పోసుకుని ప్రియుడు సూసైడ్

Love Suside

Love Suside

Crime News: బీహార్‌లోని గయాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు నిప్పంటించుకున్నాడు. మొదట తన ప్రియురాలి దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకోవాలని కోరాడు.. దీంతో ప్రియురాలు నిరాకరించడంతో యువకుడు సమీపంలోని పెట్రోల్ పంపు వద్దకు వెళ్లి పెట్రోల్ తీసుకుని మళ్లీ ప్రియురాలి దగ్గరకు వచ్చాడు. మళ్లీ చివరగా పెళ్లి చేసుకోవాలని అని అడగగా.. అప్పుడు కూడా నిరాకరించడంతో యువకుడు తనపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటర గయా జిల్లాలోని డెల్హా పోలీస్ స్టేషన్ పరిధిలోని మద్రాజ్ బిఘా గ్రామంలో జరిగింది.

Read Also: SBI : రూ. 5 వేలతో, రూ.50 లక్షలు లాభం.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే డబ్బే డబ్బు..

తీవ్ర గాయాలైన యువకుడు అక్కడే నేలపై కొట్టుకుంటూ ఉన్నాడు. యువకుడిని గమనించిన స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడిని అమన్‌(24)గా గుర్తించారు. మంటలతో అమన్ శరీరం 60 శాతం కాలిపోయింది. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సీరియస్ సిట్యుయేషన్స్ లో కూడా తన ప్రియురాలి పేరునే కలవరిస్తున్నాడు. ఒక్కసారి తనతో మాట్లాడాలని అంటున్నాడు. ఆ అమ్మాయితో అమన్ గత ఐదేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు. యువకుడి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు మాట్లాడుతూ.. కాలిన శరీరంతో స్థానికులతో పాటు పోలీసులు ఆస్పత్రిలో చేర్చారని.. అతని పరిస్థితి విషమంగా ఉందన్నారు. యువకుడిని హైలీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచామని.. నిపుణులైన వైద్యులు యువకుడికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

Read Also:RGV: ఏపీ ప్రజలపై ఆర్జీవీ ఫైర్.. వెన్నుపోటు పొడుస్తున్నారు అంటూ..

మరోవైపు యువతికి తల్లిదండ్రులు లేకపోవడంతో.. అమ్మమ్మతాతయ్యల దగ్గరు ఉంటుంది. అమ్మాయి తాత ఘజండి స్టేషన్‌లో పనిచేస్తాడు. యువకుడు అమన్ తల్లితండ్రులు కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. వారిద్దరి మధ్య 2018 నుంచి ప్రేమాయణం సాగుతోంది. యువతి ఓ NGOలో పని చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.

Show comments