Vijayawada Crime: విజయవాడలో దారుణం చోటుచేసుకుంది.. ప్రేమ వ్యవహారంలో ఒక వ్యక్తి దారుణంగా హత్యకు గురైన ఘటన బెజవాడలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన నవీన్ కు ఒంగోలుకు చెందిన బాలికతో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది.. దీంతో సదరు మైనర్ బాలిక.. నవీన్ కోసం ఒంగోలు నుండి విజయవాడలోని నవీన్ ఇంటికి వెళ్లిపోయింది.. ఇక, బాలికను బుజ్జగించి ఇంటికి తీసుకెళ్తామని వచ్చిన కుటుంబ సభ్యులు.. విజయవాడ చిట్టి నగర్ లోని ఆ బాలిక మేనమామను తీసుకుని ప్రియుడి ఇంటికి బుధవారం సాయంత్రం వెళ్లారు..
Read Also: Covid Deaths in Andhra Pradesh: ఏపీలో కోవిడ్ మరణాలు..! క్లారిటీ ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ
ఇక, నవీన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి.. సదరు బాలికను చిట్టినగర్ లోని మేనమామ ఇంటికి తాసుకువెళ్లారు.. అయితే, కొద్దిసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ బాలిక.. దీంతో మరలా నవీన్ ఇంటికి చేరుకున్న ఆ బాలిక కుటుంబ సభ్యులు, మేనమామ శ్రీనివాస్.. నవీన్‌ను నిలదీశారు.. తన వద్ద నుండి తీసుకెళ్లి.. మళ్లీ తనను ప్రశ్నిస్తున్నారా? అంటూ గొడవకు దిగాడు నవీన్.. ఆవేశంలో కత్తితో బాలిక మేనమామపై దాడికి దిగాడు.. శ్రీనివాస్ చాతిలో బలంగా కత్తి దిగడంతో.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు శ్రీనివాస్.. ఆస్పత్రికి తరలించే సరికి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.. దీంతో సత్యనారాయపురం పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. మరోవైపు ఇంకా ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలిక ఆచూకీ లభ్యం కాలేదు..