NTV Telugu Site icon

Viral: బాయ్‌ఫ్రెండ్‌ని పెట్టెలో దాచి పెట్టిన యువతి.. చివరికి ఏమైందంటే..?

Viral

Viral

సోషల్ మీడియాలో ఎన్నో రకాలైన వీడియోలు ఉంటాయి. అందులో కొన్ని ఫన్నీవీ ఉంటే.. మరి కొన్ని హర్రర్ ఇతరత్రా వీడియోలు దర్శనమిస్తాయి. అయితే ఎక్కువగా ఫన్నీ వీడియోలను చూడటానికే నెటిజన్లు ఇష్టపడతారు. కొన్ని నమ్మే రకంగా ఉంటే..మరి కొన్ని నమ్మశక్యం కానీ వీడియోలు ఉంటాయి. అయితే.. ఇటీవల, బీహార్ లో ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులోఒక అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ను కుటుంబ సభ్యులకు భయపడి ఓ ట్రంకు పెట్టెలో దాచిపెట్టి తాళం వేసింది.

Read Also: Gujarat: రూ. 1.07 కోట్ల చోరీలో దొంగల్ని పట్టించిన పోలీస్ జాగిలం..

ఎక్స్‌లో షేర్ చేసిన వీడియోలో ప్రియుడు ఆమెను కలవడానికి తన ప్రియురాలి ఇంటికి వచ్చాడని వెల్లడించాడు. ఇంతలో ప్రియురాలి తల్లి రాగా.. ప్రియుడు దాక్కోవడానికి ప్రయత్నించి ఆమె గది లోపలికి వచ్చాడు. ఈ క్రమంలో.. తన ప్రియుడిని ఒక పెట్టెలో దాచిపెట్టి బయట నుండి లాక్ చేసింది. ఆ తర్వాత తన గదికి వచ్చిన ప్రియురాలి తల్లి.. బట్టలు, సామాన్లు చెల్లాచెదురుగా, పెట్టెకు తాళం వేసి ఉండటం చూసి అనుమానం వచ్చింది. ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న యువతి తమ్ముడు ట్రంకుపెట్టెని తెరవమని అమ్మాయిని కోరాడు. దీంతో.. తప్పేది లేక ఆ పెట్టె తెరవడంతో అందలో నుంచి యువకుడు బయటపడ్డాడు. కాగా ఈ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో X హ్యాండిల్ ద్వారా @Viralvibes07 పోస్ట్ చేశారు. కాగా.. ఈ వీడియోకు భారీగానే లైక్స్, కామెంట్స్ వచ్చాయి. అలాగే చాలా మంది చూశారు. ఈ వైరల్ వీడియోను చూసిన తర్వాత, చాలా మంది వినియోగదారులు తమ స్పందనను తెలియజేశారు. అంత‌ చిన్న పెట్టెలో యువ‌కుడిని ఎలా దాచి పెట్టిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫన్నీ కామెంట్లతో కామెంట్స్ చేస్తున్నారు.

Read Also: Ananya Nagalla: కాస్టింగ్ కౌచ్ పై అనన్య షాకింగ్ కామెంట్స్

Show comments