NTV Telugu Site icon

Immoral Relationship : కొత్త ప్రేమకు మాజీ ప్రియుడు అడ్డంకి.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న ప్రియురాలు

New Project (3)

New Project (3)

Immoral Relationship : దేశంలో అనైతిక సంబంధాల కారణంగా అత్యాచారం, ఆత్మహత్యలు, హత్యలు వంటి కేసులు నిత్యం తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త ప్రేమకు మాజీ ప్రియుడు అడ్డంకిగా మారాడు. దాంతో ప్రియురాలే అతన్ని చంపేసింది. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా దుబౌలియా పోలీస్ స్టేషన్‌ పరిధిలోని కంఘుసర గ్రామంలోని కాలువలో మార్చి 29న యువకుడి మృతదేహం లభ్యమైంది. వికాస్ చౌదరి అనే యువకుడి మృత దేహమని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసు విషయమై పోలీసులు షాకింగ్ వివరాలను వెల్లడించారు.

Read Also: Son In Law Protest: అత్తగారింటి ఎదుట అల్లుడి నిరసన

మృతుడు వికాస్ చాలా రోజులుగా గ్రామానికి చెందిన యువతితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. వారి ప్రేమలో మనస్పర్ధలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య ఉన్న వివాదాని కులవేంద్ర ఓ యువకుడు ఉపయోగించుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో యువతికి కులవేంద్రపై మోజు పెరిగింది. దాంతో ఈ యువతి తన మొదటి ప్రియుడిని చూడడం, పట్టించుకోవడం మానేసింది. వికాస్ అప్పటికే యువతికి సంబంధించిన అసభ్యకర వీడియోలు, ఫొటోలు, ఆడియో క్లిప్‌లను రూపొందించాడు. తర్వాత వికాస్ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.

వికాస్ బాలికను పిలిచి, రాకపోతే వీడియో, ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరించాడు. వీడియోను బాలిక కుటుంబ సభ్యుల మొబైల్‌కు పంపుతానని బెదిరించి దుర్భాషలాడాడు. మార్చి 29వ తేదీ రాత్రి వికాస్ తరుణికి ఒంటరిగా ఫోన్ చేయడంతో తరుణి కోపంతో మరో ప్రియుడు కులవేంద్రకు ఫోన్ చేసింది. ఆ తర్వాత ఇద్దరూ గొంతుకోసి హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు.

Read Also:Himanta Biswa Sarma: ఖలిస్తాన్ ఉగ్రవాది నుంచి అస్సాం సీఎంకు బెదిరింపులు..

మార్చి 29న యువకుడి మృతదేహం లభ్యమైన అనంతరం శవపరీక్ష నిర్వహించినట్లు ఏఎస్పీ దీపేంద్ర చౌదరి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఓ బాలికతో పాటు గుర్తుతెలియని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారి సమగ్ర విచారణ అనంతరం ఘటన మొత్తం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రియురాలు తరుణి, ఆమె రెండో ప్రియుడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.