NTV Telugu Site icon

Jangaon: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా..పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

New Project (1)

New Project (1)

ప్రేమ మత్తులో పడి యువతకు కళ్ళు మూసుకుపోయాయి. వయసులో ప్రేమకు ఆకర్షణకు మధ్య తేడా తెలియక చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు మోసపోతున్నారు. ప్రేమించిన వారి కోసం ఇంటి నుంచి పారిపోయి తల్లిదండ్రులను బాధ పెట్టే వారు కొందరైతే.. ప్రేమ పేరుతో మోసపోయిన ఆత్మహత్యలు చేసుకున్న వారు మరి కొందరు. కానీ కొంతమంది యువతులు మాత్రం ప్రేమించిన వారు మోసం చేశారని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధైర్యంగా ధర్నా చేసింది. కానీ ప్రియుడి కుంటుంబ సభ్యలు ఇంటికి తాళం వేసి పారిపోవడంతో మనస్థాపం చేంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.

READ MORE: Siddipet: 16 ఏళ్ల బాలుడిపై కన్నేసిన 27 ఏళ్ల వివాహిత.. ఫోక్సో కేసులో మహిళ అరెస్ట్

వివరాల్లోకి వెళిలే.. జనగామ జిల్లా చిల్పూరు మండలం, రాజవరంలో ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. “చింతల శ్రీలత, గంగారపు కృష్ణ గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురికి హైదరాబాద్ లో పరిచయం ఏర్పడింది. యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వేరే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ప్రియురాలి నంబర్ బ్లాక్ చేశాడు. గతంలో కూడా యువతి పురుగుల మందు తాగి గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. పెద్దల మధ్య కూర్చోబెట్టి పెళ్లి చేసుకోవాలని యువకుడిని బ్రతిమలాడగా.. అతడు నిరాకరిస్తున్నాడు. నాకు అదే అబ్బాయి కావాలని ప్రియుకాలు పట్టుబట్టి కూర్చుంది. అతడి తోనే చావైనా బ్రతుకైనా అని అతడి ఇంటి ముందుకు వచ్చి కూర్చుంది. స్పందించక పోవడంతో పురుగుల మందు తాగింది.” అని ప్రియురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.