Lovers Suicide: విశాఖలోని భీమిలి సమీపంలో లాడ్జిలో ఓ యువకుడు అనుమానస్పద మృతి కలకలం రేపింది.. మృతుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న శ్యామ్ కుమార్ గా గుర్తించారు.. మద్యంలో పాయిజన్ కలుపుకుని యువ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. అయితే, నా చావుకు ఎవరూ కారణం కాదు.. సారీ అమ్మ.. అంటూ రాసిన సూసైడ్ నోట్ లభించింది.. ప్రేమించిన యువతి పావనితో గొడవే చావుకు కారణంగా తెలుస్తుంది.. హైదరాబాద్ లో శ్యామ్ కుమార్, పావని మద్య జరిగిన గొడవ కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది పావని.. అయితే, పావని పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నుంచి పారిపోయి విశాఖ వచ్చాడు శ్యామ్ కుమార్.. పావని మృతి చెందందని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు..
Read Also: Congress: నేపాల్ తరహాలో కాంగ్రెస్ నిరసన ప్లాన్.. పెద్ద కుట్ర ఉందన్న పోలీసులు..
ఈ నేపథ్యంలోనే మద్యంలో విషం కలుపుకుని శ్యామ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. తలుపులు తీయకపోవడంతో లాడ్జి సిబ్బందికి అనుమానం కలిగి స్పేర్ కీ తో తలుపులు తీసి చూడగా విగతజీవిగా పడివున్నాడు శ్యామ్ కుమార్.. పోలీసులకు సమాచారం అందించారు లాడ్జి సిబ్బంది.. రెండు సూసైడ్ నోట్లు, ఎలుకల మందు ప్యాకట్లు లభ్యం అయ్యాయి.. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. మృతుడు స్వస్థలం విశాఖలోని పాత పోస్టాఫీస్ ప్రాంతం.. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు…
