Site icon NTV Telugu

Bihar: బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ.. 300 అడుగుల లోతైన లోయలోకి జంప్.. ఆ తర్వాత ఏమైందంటే?

New Project (91)

New Project (91)

Bihar: బీహార్‌లోని నలందలో 300 అడుగుల ఎత్తైన కొండ ప్రాంతం నుంచి ఓ మైనర్ బాలిక లోయలోకి దూకింది. ఆ యువతి తన ప్రియుడితో గొడవపడి ఆత్మహత్య చేసుకునేందుకు కొండపై నుంచి దూకింది. దూకడంతో ఆమె పొదలో కూరుకుపోయింది. పొదల్లో కూరుకుపోయిన బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆరుగురు వ్యక్తులు ఆ యువతిని పొదల్లో నుంచి బయటకు తీసి బీహార్‌ షరీఫ్‌లోని సదర్‌ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించింది. క్రిటికల్ గా ఆమెను పావపురి మెడికల్ కాలేజీకి రెఫర్ చేశారు.

Read Also:Bigg Boss Telugu 7: హౌస్లోకి గౌతమ్ రీ ఎంట్రీ…వస్తూనే శివాజీకి షాక్..

ఆ అమ్మాయి నలంద జిల్లాలోని రాహుయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటోంది. ఆమె ఓ యువకుడితో కలిసి హిరణ్య పర్వతానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ అబ్బాయి ఆమె ప్రేమికుడిగా చెబుతున్నారు. ఇద్దరూ గుడి వెనుక కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దీని తరువాత ఏదో విషయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆపై అమ్మాయి హిరణ్య పర్వతం నుండి దూకింది. యువతి ఒక్క సారిగా దూకడంతో భయంతో యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.

Read Also:Kancharla Bhupal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. గ్రామంలో అడుగుపెట్టకుండానే..!

యువతి అరుపులు విన్న ప్రజలు కింద పొదల్లో చిక్కుకున్న ఆమెను చూశారు. ఇంతలో అక్కడున్న వారు డయల్ 112కి కాల్ చేశారు. పోలీసులు రాకముందే ఆరుగురు వ్యక్తులు 45 నిమిషాల పాటు శ్రమించి ఆమెను పొదల్లో నుంచి బయటకు తీసి పైకి తీసుకొచ్చారు. బాలిక అపస్మారక స్థితికి చేరుకుందని చెబుతున్నారు. ఇంతలో పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక ప్రజల సహాయంతో ఆమెను సదర్ ఆసుపత్రి బీహార్ షరీఫ్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాలికను పావాపురికి రిఫర్ చేశారు. ఈ విషయమై ఇంతవరకు ఎవరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు.

Exit mobile version