Site icon NTV Telugu

Viral: పాపం కొత్త అనుకుంటా.. స్కూటీ పార్కింగ్ నేలపై చేయాలి.. గేట్లపై కాదు

New Project (26)

New Project (26)

Viral: ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలతో పాటు డ్రైవింగ్లో దూసుకుపోతున్నారు. కానీ కొన్ని సార్లు వాళ్లు చేసే తప్పిదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తోంది. ఆ అమ్మాయి సరైన సమయంలో బ్రేక్‌లను నొక్కడానికి బదులుగా యాక్సిలేటర్ను తిప్పింది. ఆపై ఏమి జరిగిందో చూస్తే తెగ నవ్వేసుకుంటారు. కావాలంటే కింద వీడియో చూడండి. ఒక అమ్మాయి స్కూటీని పార్క్ చేయాలనుకుంటుంది. కాని ఆమె ఆ సమయంలో బ్రేక్‌లను నొక్కడానికి బదులుగా యాక్సిలేటర్ రేస్ చేస్తుంది. ఇంకేముంది స్కూటీ నేరుగా గేట్ ఎక్కి కూర్చుంది. నెటిజన్లు ఈ వీడియోను తెగ లైక్ చేస్తున్నారు.

Read Also: CM Jagan Mohan Reddy: కొత్త పాలిటెక్నిక్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్

బాలికలు స్కూటీని నడపడానికి ఎంత ఇష్టపడతారో మనందరికీ తెలుసు. అయితే, మహిళలు తరచూ ఇలాంటి తప్పులే చేస్తారు. ఆ క్రమంలోనే చాలా బాధలు అనుభవిస్తారు. వాస్తవానికి, బాలికలు ఆత్రుతలో బ్రేక్ కు బదులుగా యాక్సిలరేటర్‌ను తిప్పారు. ఈ క్రమంలో అమ్మాయిలు చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేయబడ్డారు. వీడియోలో ఇలాంటిదే జరిగింది. ఈ వీడియోలో ఒక అమ్మాయి హెల్మెట్ ధరించి కనిపిస్తుంది. ఆమె స్కూటీ బ్రేక్ నొక్కడానికి బదులుగా యాక్సిలరేటర్‌ను తిప్పడంతో స్కూటీ అదుపు తప్పి నేరుగా వెళ్లి ఇంటి గేట్ ఎక్కేస్తుంది. వెంటనే పక్కనున్న ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ స్కూటీని దించుతారు. ఈ వీడియోను హస్నా జరాణి హై అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. 20 వేలకు పైగా ప్రజలు ఈ క్లిప్‌ను చూశారు. చాలా మంది ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ ‘ఇది చూసిన తర్వాత స్కూటీ నేను నేర్చుకోను అని.., మరొకరు ‘ఎవరూ గేట్ తెరవకపోతే ఏం చేస్తారు.. మరొకరేమో ‘ ఈ విధంగా ఎవరు పార్కింగ్ చేయలేరు అంటూ కామెంట్ చేశారు.

Exit mobile version