NTV Telugu Site icon

girl murder : రెండేళ్ల క్రితం బాలికను పొడిచి చంపిన యువకుడు.. ఉరిశిక్ష వేసిన గుజరాత్ కోర్టు

Gujarat Murder Case

Gujarat Murder Case

రెండేళ్ల క్రితం ఓ బాలికను అత్యంగత పాశవికంగా పొడిచి చంపిన యువకుడికి గుజరాత్ కోర్డు ఉరిశిక్ష విధించింది. రాజ్ కోట్ లో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన కేసును అరుదైన కేసులో భావించిన న్యా యమూర్తి సదరు యువకుడికి సోమవారం మరణశిక్ష్ విధిస్తూ తీర్పునిచ్చారు. ఓ యువకుడు ఇంటర్ చదివే అమ్మాయి వెంట పడి ప్రేమించానంటూ వేధించాడు. తనకు ఇష్టంలూదంటై చెప్పినా వినలేదు.. ఆఖరికి వెంటాడి వేధించి తన ప్రేమను నిరాకరించిన నువ్వు బతకటానికి వీల్లేదని ఆమెపై కత్తితో 34 సార్లు పొడిచి చంపాడు. ఆ తరువాత జైలుపాలయ్యాడు.. అన్ని సాక్షాధారాలు కోర్టుకు సమర్పించడంతో దోషిగా తేలిన ఆ యువకుడికి గుజరాత్ కోర్టు మరణశిక్ష విధించింది.

Also Read : TSPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక భేటీ

రాజ్ కోట్ లో2021 మార్చ్ లో ఇంటర్ చదివే ఓ అమ్మాయి వెంటపడి ప్రేమిస్తున్నానంటూ వేధించాడు జయేష్ సార్వయా అనే 26 ఏళ్ల యువకుడు. కానీ ఆమె మాత్రం తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పింది. కానీ వినలేదు.. వెంటాడి వేధించాడు.. ఆఖరికి ఓ రోజు జెట్ పూర్ లోని జెతల్ సర్ గ్రామంలో నివసించే ఆమె ఇంటికి వెళ్లి నన్ను ప్రేమిస్తావా లేదా.. అని బెదిరించాడు.. అప్పుడు ఆమె కూడా నిరాకరించింది. దీంతో కొట్టాడు. సదరు బాలిక పారిపోవటానికి ప్రయత్నం చేసింది. వెంటాడి పట్టుకుని కత్తితో 34 సార్లు పొడిచి పొడిచి చంపేశాడు. అడ్డుకున్న కుటుంబసభ్యులపై కూడా దాడి చేశాడు. 34 సార్లు అత్యంత దారుణంగా పొడవటంతో సదరు బాలిక ప్రాణాలు కోల్పోయింది.

Also Read : CM Jagan Mohan Reddy: విశాఖపై జగన్ క్లారిటీ…కొందరు మంత్రులకు క్లాస్

దీంతో కుటుంబసభ్యులు జయేష్ సార్వయాపై పోలీసులకు ఫిర్యదు చేశారు. నిందితుడికి ఉరి శిక్ష వేయాలని కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు డిమాండ్ చేస్తూ ధర్నాలు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని ఆరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేసిన అన్ని సాక్ష్యాలు కోర్టుకు సమర్పించారు.. కోర్టు నిందితుడికి దోషిగా నిర్థారించి మరణశిక్ష వేసింది. అడిషనల్ డిస్ట్రిక్ట్స్, సెషన్స్ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి మరణ శిక్ష విధించింది. నిర్భయ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఈ కేసును న్యాయమూర్తి అరుదైన కేసుల్లో అరుదైనదిగా అభివర్ణించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ జనక్ పటేల్ తెలిపారు. సదరు దోషికి ఐపీసీ 302 ప్రకారం మరణశిక్ష ఖరారు చేయబడింది. ఈ శిక్షతో పాటు రూ. 5 వేల జరిమాన కూడా విధించింది. అప్పీలు చేసుకునేందుకు నిందితుడికి నెల రోజుల సమయం ఇచ్చారు.