Site icon NTV Telugu

Girl Kills Elder Brother: మొబైల్‌ ఫోన్ వాడనివ్వట్లేదని అన్నను చంపిన చెల్లెలు

Mobile Phone

Mobile Phone

Girl Kills Elder Brother: మొబైల్‌ ఫోన్ వాడనివ్వట్లేదని తన అన్నను ఓ బాలిక హత్య చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాఘర్-చుయిఖదాన్-గండాయ్ (కేసీజీ) జిల్లాలో 14 ఏళ్ల బాలిక మొబైల్ ఫోన్‌లో అబ్బాయిలతో మాట్లాడినందుకు తనను మందలించాడని తన అన్నయ్యను నరికి చంపినట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం చుయిఖదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్లిదిహ్కల గ్రామంలో జరిగిన నేరానికి బాలికను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటన జరిగిన సమయంలో ఇతర కుటుంబ సభ్యులు పని మీద బయటకు వెళ్లారని, తాను, తన సోదరుడు (18) ఇంట్లో ఉన్నారని బాలిక పోలీసులకు తెలిపింది.

Read Also: Uttarakhand : బయటి నుంచి తీసుకొచ్చిన రూ.15కోట్ల మద్యం స్వాధీనం

మొబైల్ ఫోన్‌లో అబ్బాయిలతో మాట్లాడుతోందని, ఇకపై ఫోన్ ఉపయోగించవద్దని ఆమెను మందలించాడు. మందలించడంతో తెలివిగా, అతను నిద్రలోకి జారుకున్నప్పుడు గొడ్డలితో అతని గొంతుపై నరికిందని, అతను అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. బాలిక స్నానం చేసి, తన బట్టలపై ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసి, తన సోదరుడు హత్యకు గురయ్యాడని ఇరుగుపొరుగు వారికి చెప్పింది. పోలీసుల విచారణలో అతడిని హత్య చేసినట్లు అంగీకరించినట్లు ప్రకటనలో పేర్కొంది. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version