Site icon NTV Telugu

Kerala Express: బాయ్‌ఫ్రెండ్‌తో గొడవ.. కదులుతున్న రైలు ముందు దూకేసిన అమ్మాయి..

Train

Train

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా వద్ద కదులుతున్న రైలు ముందు దూకి మే 27 న ఒక మహిళ మరణించింది. ఆగ్రాలోని రాజ కీ మండి రైల్వే స్టేషన్‌లో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన ఈ షాకింగ్ సంఘటన ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్‌ లోని సీసీటీవీ నిఘా కెమెరాలో రికార్డయింది. రైలు స్టేషన్‌ కు చేరుకోగానే రాజ కీ మండి రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై కూర్చున్న తన ప్రియుడితో గొడవ పడుతూ రైలు ట్రాక్‌ పైకి వెళ్ళింది. రైలు సమీపంలోకి రాగానే, ప్లాట్‌ఫారమ్ వైపు పరిగెత్తింది. కానీ కాంట్ నుండి వస్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు ఆమెను పట్టాలపైనే ఢీకొట్టింది.

Pushpa2 First Single: తగ్గేదేలే.. 10 కోట్ల వ్యూస్ తో పుష్పగాడి రచ్చ మాములుగా లేదుగా..

ఇక 33 సెకన్ల సీసీటీవీ ఫుటేజీలో రైలు వస్తున్నట్లు చూసినా బాలిక పట్టాలపైకి దూకినట్లు తెలుస్తోంది. రైలు ఢీకొని ఆమెను రైలు కిందికి పడిపోతున్న సమయంలో కూడా ఆమె తన ప్రియుడితో వాదించడం చేసింది. ఈ ఘోర ప్రమాదం జరిగిన తర్వాత ఆమె ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం., సదరు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఆమెను రైల్వే పోలీసులు చికిత్స కోసం SN మెడికల్ కాలేజీ అండ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించి, ఆమె గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.

Exit mobile version