Viral Video: ఇప్పుడు ప్రపంచం మెల్లగా శాకాహారం వైపు పయనిస్తోంది. ప్రజలు మాంసం, చేపలకు బదులుగా పండ్లు, కూరగాయలను తినడానికి ఇష్టపడుతున్నారు. కాని ఇప్పటికీ మాంసాహారం అంటే ఇష్టంతో దానిని వదిలేయని వారు చాలా మందే ఉన్నారు. పాపం వారికి ముక్కలేనిదే ముద్ద దిగడు. సాధారణంగా చికెన్, మటన్, చేపలు మాత్రమే తింటారు కానీ చాలా చోట్ల గొడ్డు మాంసం, పంది మాంసం కూడా తింటారు. ఇదొక్కటే కాదు చాలా ప్రాంతాల్లో పాములు, తేళ్లు, కీటకాలను వండుకుని తింటారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసిన జనాలకు కడుపులో తిప్పడం ఖాయం.
Read Also:OMG: సముద్రంలో వందలాది కి.మీ. పెద్ద గొయ్యి.. శాస్త్రవేత్తల మెదడుకు పదును
వాస్తవానికి.. ఈ వీడియోలో ఒక అమ్మాయి బొద్దింకను తింటోంది. అది కూడా టమాటా-మిరపకాయ చట్నీతో కలిపి. సాధారణంగా టమాటా-మిరపకాయ చట్నీతో మోమోస్ తింటారు. కానీ ఇక్కడ అమ్మాయి బొద్దింకలను తింటుంది. ఆ అమ్మాయి మొదట చాలా బొద్దింకలను నూనెలో వేయించి, ఆపై ప్లేట్‌లో వడ్డించడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. ఆ ప్లేటులో టమాటా-మిరపకాయ చట్నీ కూడా ఉంది. అప్పుడు ఆమె రెండు మూడు బొద్దింకలను తీసుకుని ఎర్ర చట్నీలో బాగా ముంచి వాటిని రుచిగా తింటుంది. ఈ దృశ్యం చూస్తే ఎవరికైనా వాంతి వచ్చేలా ఉంది.
Read Also:Samantha : స్టైలిష్ లుక్ తో అదరగొడుతున్న సమంత..
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫేవరైట్‌విల్డ్ అనే ఐడీతో షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు మిలియన్ కంటే ఎక్కువ సార్లు వీక్షించబడింది. అయితే 4 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేసారు. వీడియో చూసిన తర్వాత ప్రజలు కూడా భిన్నమైన స్పందనలు ఇచ్చారు.
