NTV Telugu Site icon

Mulugu: ములుగు జిల్లాలో విషాదం.. నదిలో మునిగి బాలిక మృతి

Deid

Deid

ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎండలు తాళలేక తండ్రి, కూతురు గోదావరి స్నానానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా తండ్రి నదిలో మునిగిపో సాగాడు. దీంతో భయాందోళన చెందిన కుమార్తె నిఖిత (14) సాయం చేసేందుకు.. తన తండ్రికి చెయ్యి అందించబోయింది. అంతే ప్రమాదశాత్తు గోదావరిలో మునిగిపోయి ప్రాణాలు వదిలింది. తండ్రి రాజేందర్ మాత్రం ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. మంగపేట (మం) కమలాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పరిణామంతో తండ్రి షాక్‌కు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. కళ్లముందే కూతురు చనిపోవడంతో తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఇది కూడా చదవండి: Sex Scandal Row: కర్ణాటక రాజకీయాల్లో కలకలం.. ఎంపీ ప్రజ్వల్‌పై సస్పెన్షన్ వేటు

గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. తీవ్ర ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్నానం చేసేందుకు కుమార్తెతో కలిసి తండ్రి స్నానానికి వెళ్లారు. కానీ దురదృష్టవశాత్తు కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు గ్రామంలో, కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి: CM YS Jagan: నాది ప్రోగ్రెస్‌ రిపోర్ట్.. చంద్రబాబుది బోగస్‌.. డెవలప్‌మెంట్‌ కింగ్‌ ఎలా అవుతారు..?