Site icon NTV Telugu

Maharashtra: 127 గంటల పాటు డ్యాన్స్ చేసి బాలిక.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

Dance 127 Hours

Dance 127 Hours

మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన ఓ బాలిక సుధీర్ జగ్తాప్(16 సంవత్సరాలు) అరుదైన ఘనత సాధించింది. ఏకంగా 127గంటల పాటు డ్యాన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. అప్పటి వరకు ఉన్న 126 గంటల సుదీర్ఘ డ్యాన్స్ మారథాన్ రికార్డును ఆమె బద్దలు కొట్టింది. 2018లో నేపాల్ డ్యాన్సర్ బందానా 126 గంటల పాటు డ్యాన్స్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

సుధీర్ జగ్తాప్ డ్యాన్స్ మారథాన్ ఆమె కళాశాల ఆడిటోరియంలోనే జరిగిందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగరికర్ తెలిపాడు. బాలిక మద్దతుదారులతో ఆడిటోరియం పూర్తిగా నిండిపోయినట్లు చెప్పారు. సుధీర్ జగ్తాప్ తన డ్యాన్స్ మారథాన్‌ను మే 29ఉదయం ప్రారంభించి జూన్ 3 మధ్యాహ్నం వరకు కొనసాగించింది అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగరికర్ తెలిపాడు. డ్యాన్స్ పూర్తయ్యాక అమె రోజంతా నిద్రపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. డ్యాన్స్ మారథాన్‌ సమయంలో జగ్తాప్ అలసిపోయిన క్షణాలు చాలా ఉన్నాయని స్వప్నిల్ చెప్పుకొచ్చాడు.

Also Read: Biparjoy Cyclone: బిపర్ జోయ్ తుఫాన్ మరో 12 గంటల్లో బలహీనం

కానీ ఆమె తల్లిదండ్రులు అన్ని సమయాలలో ఆమె పక్కనే ఉన్నారని, జగ్తాప్‌ను అప్రమత్తం చేసేందుకు ఆమె ముఖంపై నీటితో స్ప్రే చేసేవారని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ న్యాయనిర్ణేత స్వప్నిల్ దంగరికర్ పేర్కొన్నారు. ఈ రికార్డు కోసం జగ్తాప్ దాదాపు 15నెలల పాటు కఠోరంగా శ్రమించింది. తన తాత బాబన్ మానే వద్ద ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ముఖ్యంగా తన తాత ఆమెకు యోగా నిద్రను నేర్పించారు. ఇది ఆమె ఐదు రోజుల పాటు నిద్రపోకుండా ఉండేందుకు సహాయపడింది అని పేర్కొన్నారు.

Exit mobile version