Site icon NTV Telugu

Giorgia Meloni: ప్రపంచ వ్యాప్తంగా చర్చ..! ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తాగే సిగరెట్ ఏదో తెలుసా..?

Meloni

Meloni

Giorgia Meloni: ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియో మెలోని ధూమపానం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్.. మెలోనిని ధూమపానం మానేయమని సలహా ఇచ్చారు. యూరోపియన్ మీడియా పొలిటికో ఈ విషయంపై నివేదించింది. కొద్ది క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది. అసలు మెలోని ఏ సిగరెట్ తాగుతుంది? అనే చర్చ జోరందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది నెట్‌లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. అయితే.. గతంలో ఈ విషయంపై మెలోని క్లారిటీ ఇచ్చారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

READ MORE: Charlie Kirk: చార్లీ కిర్క్ 32వ బర్త్‌డే.. ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్‌ను ప్రదానం చేసిన ట్రంప్

2022 ఎన్నికల ప్రచారంలో జార్జియా మెలోని తన అనుభవాలను వివరిస్తూ తన వెబ్‌సైట్‌లో ఆత్మకథను ప్రచురించింది. అదే నివేదికలో మెలోని అప్పుడప్పుడు అల్ట్రా-స్లిమ్(చాలా సన్నని) సిగరెట్లు తాగుతానని పేర్కొంది. రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతుంది? బ్రాండ్ ఏది అనే వివరాలను అందించలేదు. ప్రధానమంత్రి అయిన తర్వాత, మెలోని ఒక వైన్ ఫెయిర్‌లో కీలక వ్యాఖ్యలు చేసింది. తాను మద్యం సైతం తాగుతానని.. మితంగా తీసుకుంటానని చెప్పింది. ఈ ఫెయిర్‌లో మద్యం ఎలా తాగాలో ఆమె వివరించి అందరినీ ఆశ్చర్య పరిచింది. మరోవైపు.. ఇటాలియన్ ప్రభుత్వం ప్రకారం, 2023 నాటికి దేశవ్యాప్తంగా సిగరెట్ తాగే వారి సంఖ్య 10.5 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. 15 ఏళ్లు పైబడిన వారిలో 20 శాతం మంది ధూమపానం చేస్తున్నారు. ఇటలీలో, 22 శాతం మంది పురుషులు, 16 శాతం మంది మహిళలు ధూమపానం చేస్తున్నారు. దాదాపు 5 శాతం మంది రోజుకు 20 కంటే ఎక్కువ సిగరెట్లు తాగుతున్నారు.

READ MORE: IND vs AUS: కోహ్లీ మిస్టర్ పర్‌పెక్ట్‌.. 3 మ్యాచ్‌లలో 2 సెంచరీలు చేస్తాడు!

అసలు సిగరెట్ తాగుతున్న విషయం ఎలా బయటపడింది..?
ఈజిప్టు వేదికగా గాజా శాంతి ఒప్పందం జరిగింది. ఈ సమావేశానికి 20 దేశాలకు చెందిన అధినేతలు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇటలీ ప్రధాని మెలోని, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ సహా తదితరులంతా పాల్గొన్నారు. అయితే శాంతి సదస్సులో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్-ఇటలీ ప్రధాని మెలోని మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. చాలా అందంగా ఉన్నావు.. కానీ ధూమపానం చేయడమే బాగోలేదని మెలోనికి ఎర్డోగన్ సూచించారు. ఇకనైనా సిగరెట్ తాగడం మానేయాలని మెలోనిని ఎర్డోగన్‌ కోరారు. ఈ సందర్భంగా మెలోనిని ఒప్పిస్తున్నట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పక్కనే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కూడా ఉన్నారు.

READ MORE: IND vs AUS: కోహ్లీ మిస్టర్ పర్‌పెక్ట్‌.. 3 మ్యాచ్‌లలో 2 సెంచరీలు చేస్తాడు!

‘‘నువ్వు విమానం నుంచి కిందకు దిగడం నేను చూశాను. నువ్వు చాలా బాగున్నావు. కానీ నేను నిన్ను ధూమపానం మానేయించాలి.’’ అని మెలోనితో ఎర్డోగన్ చెప్పాడని ఇహ్లాస్ న్యూస్ ఏజెన్సీ ప్రసారం చేసిన వీడియోలో కనిపించింది. సమీపంలో నిలబడి ఉన్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నవ్వుతూ కనిపించారు. ఎర్డోగన్‌ మాటలకు మాక్రాన్ జోక్యం పుచ్చుకుని ‘‘అది అసాధ్యం!’’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మెలోని కూడా హాస్యంతో ప్రతిస్పందించింది. ‘‘నాకు తెలుసు, నాకు తెలుసు. నేను ఎవరినీ చంపాలనుకోవడం లేదు.’’ అని తెలిపారు. మెలోని 13 ఏళ్ల పాటు సిగరెట్ తాగడం మానేశారు. ఇటీవల మళ్లీ తిరిగి ధూమపానం చేయడం ప్రారంభించారు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో మెలోని చెప్పుకొచ్చారు. మళ్లీ కొత్తగా సిగరెట్ తాగడం మొదలు పెట్టినట్లు తెలిపారు. అయితే ఎర్డోగన్-మెలోని సంభాషణపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ల చేస్తున్నారు. సిగరెట్లు తాగడం మానేస్తే బాగుండును అని కొందరు కామెంట్లు పెట్టారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

నోట్: ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఇది క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్, ఊపిరితిత్తుల వ్యాధుల వంటి అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరంలోని దాదాపు ప్రతి అవయవానికి ఇది హాని చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మరణాలకు కారణమవుతుంది.

Exit mobile version