NTV Telugu Site icon

Ginger: పొలాల్లో అల్లం దొంగతనం.. సీసీ కెమెరాలు పెట్టిన రైతన్నలు

Agriculture

Agriculture

Ginger: గతంలో జరిగిన దొంగతనాలన్నీ బంగారం కోసమో.. డబ్బుల కోసమో జరిగేవి. కానీ ప్రస్తుతం కూరగాయల కోసం దొంగతనాలు జరుగుతున్నాయి. ఇది ఒకింత ఆశ్చర్యం మరోవైపు ఆందోళన కలిగించే అంశం. ద్రవ్యోల్బణం పెరగడంతో పొలాల్లో పచ్చి కూరగాయలు, మసాలా దినుసుల చోరీ మొదలైంది. టమాటా తర్వాత దొంగలు అల్లం మీద దొంగలు కన్నేశారు. ఒక్కసారిగా ధరలు పెరగడంతో అల్లం చోరీ ఘటనలు ఎక్కువయ్యాయని ఆ పంట సాగు చేసిన రైతులు చెబుతున్నారు. దీంతో లక్షల రూపాయలు నష్టపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు తమ పంటలను దొంగల బారి నుంచి కాపాడుకునేందుకు పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.

తాజాగా కర్ణాటకలో అల్లం చోరీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చీకటి పడగానే దొంగలు అల్లం దొంగిలించడానికి బయలుదేరుతారు. పొలంలో రైతు లేని సమయం చూసి అల్లం పంటను ఈ దొంగలు ఎత్తుకెళ్లారు. విశేషమేమిటంటే.. కర్ణాటకకు వచ్చిన తర్వాత అల్లం సాగు చేసే కేరళ రైతులపైనే దొంగలు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అల్లం దొంగతనంపై కేరళకు చెందిన పలువురు రైతులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Read Also:Telangana Rains: తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

కర్ణాటకకు చెందిన ఓ రైతు తన పొలంలో రూ.1.8 లక్షల విలువైన అల్లం చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హొర్లవాడి అనే మరో రైతు తన పొలంలో రూ.10 వేల విలువైన అల్లం మాయమైనట్లు బెలిగేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేయగా, మరొకరిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలో సాగు చేస్తున్న కేరళకు చెందిన రైతుల సంఘం జాతీయ రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎన్‌ఎఫ్‌పిఓ) అల్లం దొంగతనాల సంఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. తమ యూనియన్‌లోని 25 మంది రైతులు అల్లం దొంగతనానికి గురయ్యారని NFPO ప్రెసిడెంట్ ఫిలిప్ జార్జ్ చెప్పారు. రోజురోజుకూ పెరుగుతున్న దొంగతనాల వల్ల పొలాల కాపలాదారులు కూడా ప్రమాదంలో పడ్డారని ఫిలిప్ జార్జ్ అంటున్నారు. ఎందుకంటే పుల్పల్లి సమీపంలోని పెరికల్లూరులో అల్లం దొంగిలించడానికి వెళ్లిన దొంగలు ఓ రైతును కొట్టి గాయపరిచారు.

NFPO ఉపాధ్యక్షుడు, అజయ్ కుమార్ VL మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా అల్లం రైతులు ఖర్చుతో పోలిస్తే చాలా తక్కువ లాభాలను పొందగలిగారు. ఎందుకంటే ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ, ఈసారి ధరలు పెరగడంతో దొంగలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లం పంటను కాపాడేందుకు రైతులు పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిపారు.

Read Also:Horse: కలికాలం అంటే ఇదేనేమో.. బతికున్న కోడిని తినేసిన గుర్రం