కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు భావజాలాలు నచ్చి పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానించడం జరుగుతుంది అని ఆంధ్ర ప్రదేశ్ పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్దరాజు తెలిపారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తామన్నారు. వంద సంవత్సరాల క్రితం కాకినాడలో బుచ్చి సాంబమూర్తి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సెషన్స్ జరిగింది.. దాన్ని పురస్కరించుకొని ఈరోజు కాకినాడలో జరిగే సెంటినరీ సెలబ్రేషన్ లో పాల్గొనడానికి రావడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు. డీకే శివకుమార్, చంద్రబాబు ఎయిర్ పోర్ట్ లో కలిసింది.. అది వాళ్ల వ్యక్తిగతమైనది తప్ప రాజకీయంగా అయితే కాదు.. 2024లో జరిగే జనరల్ ఎలక్షన్ లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని సమయత్తం చేస్తున్నామని గిడుగు రుద్దరాజు తెలిపారు.
Read Also: Bank Holidays: వచ్చే ఏడాదిలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులో తెలుసా?
కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సంస్తాగతంగా బలోపేతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని గిడుగు రుద్దరాజు అన్నారు. అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించడానికి అధిష్టానం సంసిద్ధంగా ఉంది.. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తారు.. అలాగే స్టీల్ ప్లాంట్ వ్యతిరేకికరణపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అని ఆయన చెప్పుకొచ్చారు. త్వరలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ,డీకే శివకుమార్,రేవంత్ రెడ్డి అగ్ర నాయకులందరూ ఏపీలో పర్యటిస్తారని గిడుగు రుద్రరాజు ప్రకటించారు.