NTV Telugu Site icon

Gidugu Rudra Raju: కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు..

Gidugu

Gidugu

రేపు జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఏపీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని సీమాంధ్రలు, పార్టీ శ్రేణులన్నీ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసింది.. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సహా ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదు.. పోలవరం ప్రాజెక్టు అతి గతి లేని పరిస్థితి అయిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2014లో ఆమోదించిన విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు.. ఏపీకి అన్యాయం చేస్తూనే ఉన్నారు అంటూ గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. బీజేపీ- టీఆర్ఎస్ పార్టీలు ఒకటే.. అధికారికంగా పొత్తు లేకపోయినా రెండు పార్టీలు 10 ఏళ్లుగా కలిసే పని చేస్తున్నాయి.. తెలంగాణలోని సీమాంధ్ర ప్రజలంతా ఈ రెండు పార్టీలకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అని కోరారు.

Read Also: Chennai-Pune Train: చెన్నై-పూణే ట్రైన్‌లో కలుషిత ఆహారం.. 40 మంది ప్రయాణికులకు అస్వస్థత..

అలాగే, కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో స్థిరపడ్డ ఏపీ ప్రజలంతా తెలంగాణ కాంగ్రెస్ కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి.. కాంగ్రెస్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. తెలంగాణలో మార్పు రావాలి.. ఈ ఎన్నికతో దేశంలో మార్పు రావాలి.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుతో ఏపీకి న్యాయం జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు. పోలవరంకు జాతీయ హోదా దక్కుతుంది.. తెలంగాణ, ఏపీ అన్నదమ్ములుగా బాగు పడుదాము.. రాజకీయంగా ఏపీలో కాంగ్రెస్ బలపడడంతో పాటు కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వస్తుంది.. అప్పుడే విభజన హామీలన్నీ నెరవేరుతాయని రఘువీరారెడ్డి తెలిపారు.

Show comments